బీజేపీలోకి జేసీ దివాక‌ర్ రెడ్డి… బాబు ప‌క్క‌న పెట్టేశారా…!

అనంత‌పురం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ప‌రిస్థితి ఎటూ తేల డం లేద‌ట‌. ఆయ‌న ఇప్ప‌టికే.. కీల‌క జాతీయ పార్టీగా ఉన్న బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. నిజానికి సీమ‌లో బీజేపీ ఎద‌గాల‌ని.. క‌ల‌లు కంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో క‌లిసి వ‌చ్చే నాయ‌కుల‌తో .. పార్టీ ముందుకు సాగాల‌ని వ్యూహాలు కూడా రెడీ చేసుకుంటున్న విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే అనంతలో త‌మ హ‌వా ప్ర‌ద‌ర్శిస్తున్న జేసీ కుటుంబం.. ఇప్పుడు త‌ట‌స్థంగా ఉంది.

జేసీ దివాక‌ర్ రెడ్డి ముఖ్యంగా .. త‌ట‌స్థ పాత్ర పోషిస్తున్నారు. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆయ‌న‌.. త‌ర్వాత‌.. టీడీపీలోకి వ‌చ్చారు. ఎంపీ అయ్యారు. త‌ర్వాత‌.. గ‌త ఎన్నిక‌ల్లో త‌న కుమారుడికి అవ‌కాశం ఇప్పించుకు న్నారు. ఇక‌, ఆ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కుమార్‌రెడ్డి ఓడిపోయిన త‌ర్వాత‌.. జేసీ దివాక‌ర్‌.. టీడీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించింది లేదు. అంతేకాదు.. తను ఏపార్టీలో ఉన్న‌దీ కూడా ఆయ‌న వెల్ల‌డించ‌లడం లేదు. ఈ నేప‌థ్యంలో రెండు రోజుల కింద‌ట‌.. జేసీ ముఖ్య అనుచ‌రుడు ఒకాయ‌న‌.. కేంద్ర బీజేపీ పెద్ద‌ను హైద‌రాబాద్ లో క‌లిసివ‌చ్చార‌ట‌.

ఇప్పుడు ఇదే విష‌యం జేసీ వ‌ర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చిన బీజేపీ పెద్దాయ‌న‌తో భేటీ అయి.. ఇప్ప‌టికే తాము ఇచ్చిన విన్న‌పాన్ని ఏం చేశార‌ని.. కొంత ఆరా తీసిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలోనే రాజ్య‌స‌భ‌పై ఆశ‌లు పెట్టుకున్న జేసీ దివాక‌ర్‌.. ఈ సీటును ఇస్తే.. బీజేపీలో చేరేందుకు.. పార్టీని జిల్లాలో బ‌లోపేతం చేసేందుకు కూడా సిద్ధ‌మ‌ని సంకేతాలు ఇచ్చారు. ప్ర‌స్తుతం క‌డ‌ప‌లోనూ.. క‌ర్నూలులోనూ.. చిత్తూరులోనూ.. బీజేపీకి కొంత మేర‌కు ఫాలోయింగ్ ఉంది.

కానీ, అనంత‌లో మాత్రం పెద్ద‌గా బ‌లం లేదు. ఇలాంటి చోట‌.. జేసీకి అవ‌కాశం ఇస్తే.. పార్టీ పుంజుకుంటుం ద‌నేది.. జేసీ వ‌ర్గం మాట‌. ఈ నేప‌థ్యంలోనే రాజ్య‌స‌భ సీటు కోసం.. ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ, ఈ విష‌యంలో బీజేపీ ఎటూ తేల్చ‌డం లేదు. దీంతో ఆయ‌న ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా ఉంది. ఇటువైపు. చంద్ర‌బాబుకు జేసీకి మ‌ధ్య డిస్టెన్స్ కూడా పెరిగింది. బీజేపీ ప్ర‌య‌త్నాలు తెలిసిన చంద్ర‌బాబు జేసీని ప‌క్కన పెట్టార‌నే టాక్ వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఎటూ కాకుండా అవుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.