ఎన్టీఆర్ ఆ టైంలో అంత కుమిలిపోయాడా.. ల‌క్ష్మీప్ర‌ణ‌తి ఇంత ధైర్యం ఇచ్చిందా…!

చాలా చిన్న వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్.. నాలుగో సినిమా ఆదితో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాడు. ఐదో సినిమా అల్లరి రాముడు పక్కా మాస్ కమర్షియల్ హిట్. ఆ త‌ర్వాత సింహాద్రి 155 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడంతో పాటు ఏకంగా 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ అవ్వ‌డంతో పాటు తెలుగు సినిమా చరిత్రలో మహామహులు అయిన హీరోలు తిరగరాసిన రికార్డులకు సైతం సింహాద్రి పాతర‌ వేసింది.

సింహాద్రి సినిమా చూసి టాలీవుడ్ సీనియర్ హీరోలు సైతం ముక్కున వేలేసుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సాంబ – అదుర్స్ – యమదొంగ లాంటి మంచి హిట్ సినిమాల్లో నటించాడు. అయితే టెంపర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ కెరీర్ వరుస ఫ్లాపులతో బాగా డౌన్ అయ్యింది. ఎన్టీఆర్ మార్కెట్ బాగా దెబ్బతింది. శక్తి – రామయ్య వస్తావయ్యా – ర‌భ‌స ఫ్లాప్ అవడంతో ఎన్టీఆర్ సైతం అసలు ఎలాంటి సినిమాలు చేయాలో తెలియక డైల‌మాలోకి వెళ్ళిపోయాడు.

ఒకానొక సందర్భంలో తనకు కావలసిన సన్నిహితులతో రాజమౌళి – వినాయక్ తప్ప ఎవరితో చేసినా ఇట్లు ఇవ్వలేకపోతున్నారు అని బాధ పడినట్టుగా కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక రభస సినిమా అయితే ఎన్టీఆర్ ఇమేజ్ ను పూర్తిగా పాతాళంలోకి వెళ్ళి పోయేలా చేసింది. అసలు ఎన్టీఆర్ ఇలాంటి నాసిరకం క‌థ‌లు ఎందుకు ఎంచుకుంటున్నాడో అని ప్రతి ఒక్కరూ విమర్శలు చేసే వరకు వెళ్ళింది. అలాంటి టైమ్ లో భార్య లక్ష్మి ప్రణతి ఎన్టీఆర్ కు అండగా ఉండడంతో పాటు హిట్లు.. ప్లాపులు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి అని ధైర్యం చెప్పారట.

2015 ఫిబ్రవరిలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏడు సంవత్సరాల్లో అన్ని హిట్ సినిమాలు చేశాడు. టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై ల‌వ‌కుశ – అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా కూడా సూపర్ హిట్ అవటం ఖాయం. త్రిబుల్ ఆర్ తర్వాత కూడా కొరటాల శివ – త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లతో ఎన్టీఆర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఏదైనా కెరీర్లో ఎన్నో సార్లు పైకి లేచి కింద పడినా తిరిగి పైకి లేవటం ఎన్టీఆర్‌కే చెల్లింది.