భీమ్లానాయ‌క్ హిట్ అయిన న‌ష్టాలు త‌ప్ప‌లేదే…!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ న‌టించిన భీమ్లానాయ‌క్ గ‌త శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుం కోషియ‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఈ సినిమాలో రానా ద‌గ్గుబాటి కూడా న‌టించారు. మ‌ల్టీస్టార‌ర్ సినిమా కావ‌డంతో పాటు నిత్యామీన‌న్‌, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించ‌డం.. థ‌మ‌న్ మ్యూజిక్‌, త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు స‌మకూర్చ‌డంతో సినిమా మామూలు అంచ‌నాల‌తో రిలీజ్ కాలేదు.

ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఫ‌స్ట్ షోకు పర్లేదు అన్న టాక్ తెచ్చుకుంది. అయితే స‌డెన్‌గా నాలుగు, ఐదు రోజుల నుంచి సినిమా అనుకున్న‌దానికంటే బాగా డ్రాప్ అయ్యింది. ముఖ్యంగా ఏపీలో ప‌లు చోట్ల వ‌సూళ్లు బాగా ప‌డిపోయాయ‌నే అంటున్నారు. నైజాంలో ఐదు షోల‌తో పాటు టిక్కెట్ రేట్లు ఎక్కువ‌గానే ఉన్నా ఇంకా బ్రేక్ ఈవెన్‌కు రాలేదు. ఒక్క ఓవ‌ర్సీస్‌లో మాత్ర‌మే భీమ్లా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వ‌చ్చేసింది.

ఏపీలో ఉత్త‌రాంధ్ర డిస్ట్రిబ్యూట‌ర్ అనుకున్న దానికంటే ఎక్కువ క‌ట్టాడు. అక్క‌డ భీమ్లా బ్రేక్ ఈవెన్‌కు రావ‌డం అసాధ్యంగానే క‌నిపిస్తోంది. ఇక ఈస్ట్‌, వెస్ట్‌లో అనుకున్న‌దానికంటే త‌క్కువ క‌ట్టినా చ‌చ్చీ చెడీ బ్రేక్ ఈవెన్‌కు రావొచ్చేమో అంటున్నారు. కృష్ణాలో టిక్కెట్ రేట్లు మ‌రీ త‌గ్గించి అమ్మారు. అక్క‌డ కూడా బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఆగిపోతుంద‌ని అంటున్నారు. ఓవ‌రాల్‌గా చూస్తే ఏపీలో వ‌సూళ్లు బాగా డ్రాప్ అయ్యారు.

ఇప్పుడున్న ఆక్యుపెన్సీతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు వ‌చ్చే ఛాన్సులు లేవు. అటు నైజాంలోనే ఇంకా రు. 5 కోట్ల‌కు పైనే రావాలి. ఏదేమైనా సినిమా హిట్ హిట్ అంటున్నా వ‌సూళ్లు మాత్రం ఆ స్థాయిలో లేవు.