అదే జ‌రిగితే.. వైఎస్ కుటుంబంలో రాజ‌కీయ కుదుపు…!

కొన్ని కొన్ని అంశాలు.. రాజ‌కీయంగా అనేక కుదుపుల‌కు దారితీస్తాయి. ప్ర‌స్తుతం వైఎస్ కుటుంబాన్ని తీసు కుంటే.. రెండు ప‌క్షాలుగా విడిపోయింది. ఒక‌టి విజ‌య‌మ్మ‌ను స‌మ‌ర్ధించే వ‌ర్గం.. రెండు జ‌గ‌న్‌ను స‌మ‌ర్ధించే వ‌ర్గం. విజ‌య‌మ్మ‌ను స‌మ‌ర్ధిస్తున్న‌వారు.. ష‌ర్మిల ను రాజ‌కీయంగా ప్రోత్స‌హిస్తున్నారు. చాలా మంది కుటుంబ స‌భ్యులు ఇటీవ‌ల గోప్యం రాజ‌కీయ విరాళాలు కూడా ఇచ్చార‌ని.. హైద‌రాబాద్‌లో పెద్ద చ‌ర్చ సాగుతోంది. ఆమె పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో చాలా విరాళాలు వ‌చ్చాయి. ఎవ‌రో ఒక‌రు రావ‌డం.. విరాళం ఇవ్వ‌డం.. చేశారు. అయితే.. అంత డ‌బ్బులు వారికి ఎలా వ‌చ్చాయ‌ని ఆరా తీస్తే.. వైఎస్ కుటుంబ‌మే ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

అంటే.. వీరంతా కూడా ష‌ర్మిల‌కు అనుకూలం. అలాగ‌ని..పైకి అంటే.. జ‌గ‌న్‌కు విరోధ‌మ‌య్యే ప‌రిస్థితి ఉం టుంది. దీనిని బ‌ట్టి.. వైఎస్ కుటుంబంలోనే రెండు వ‌ర్గాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. మ‌రీము ఖ్యంగా ష‌ర్మిల‌కు వైసీపీలో అన్యాయం జ‌రిగింద‌నేఆవేద‌న ఈ కుటుంబంలోనే క‌నిపిస్తోంది. ఇదిలావుంటే.. దివంగ‌త వివేకా కేసులో ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానంపైనా.. వైఎస్ కుటుంబం.. ఆవేద‌న‌గానే ఉంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. ఒక‌విధంగా.. ఇప్పుడు మ‌రో విధంగా వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌నే వాద‌న ప్ర‌తిప‌క్షం కంటే..ఎక్కువ‌గానే వైఎస్ కుటుంబంలో వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే చీలిక‌లు వ‌చ్చాయ‌ని అంటున్నారు.

వివేకా కుమార్తె సాహ‌సం చేసి.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా.. హైకోర్టులో పిటిష‌న్ వేయడం కూడా కుటుంబ స‌భ్యుల ద‌న్నుతోనేన‌ని.. పులివెందుల‌లోనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు ఆమె రాజ‌కీయంగా అరం గేట్రం చేస్తే.. అది మ‌రింత‌గా.. వైసీపీకి ఇబ్బంది తెచ్చిపెడుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వివేకా పై సానుభూతి చాలానే ఉంది. సొంత కుటుంబానికి చెందినవారే(బీర‌కాయ‌పీచు సంబంధం ఉన్న‌వారే) ఈ కేసులో ప్ర‌ధాన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు సునీత క‌నుక రాజ‌కీయంగా అరంగేట్రం చేసి.. టీడీపీ వైపు వెళ్తే.. వైఎస్ కుటుంబంలో పెద్ద ఎత్తున చీలిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. ఇది వైసీపీపై ప్ర‌భావం కూడా చూపిస్తుంద‌ని అంటున్నారు.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అంటే.. ఇష్టం ఉందా.? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. జ‌గ‌న్‌పై ఉన్న వ్య‌తిరేక‌త వీరిని టీడీపీ వైపు ఆక‌ర్షించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. అంటే.. వైసీపీ వైపు మొగ్గ‌కుండా.. మ‌రో పార్టీవైపు మొగ్గినా.. ఆ పార్టీకి ఉన్న ప‌రిస్థితిని వీరు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎడ్జ్ ఉంటుంద‌ని.. సో.. ఇబ్బంది లేద‌ని.. కూడా వైఎస్ కుటుంబం బాగానే అంచ‌నాలు వేసుకుంటోంది. అయితే.. రాజ‌కీయంగా నిర్ణ‌యంతీసుకునే విష‌యంలో ఇంకా స‌మ‌యం ప‌డుతుంద‌ని.. హైకోర్టు ఇచ్చే తీర్పు మేర‌కు ఈ నిర్ణ‌యం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు… చెబుతున్నారు.