ధనుష్‌ లైఫ్ లోకి కొత్త మెంబర్..వార్ని..అప్పుడే అంత తొందారా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. నేచురల్ గా యాక్ట్ చేసే ఈయన అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా అభిమానం. తమిళ సినిమాలు తెలుగు లో కూడా డబ్ అవుతుండడతో ఈయనకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. ప్రస్తుతం ఈయన బడా బడా డైరెక్టర్స్ తో సినిమాలకు కమిట్ అవుతూ సినిమాల పరం గా బిజీ బిజీ గా ఉన్నాడు. అయితే సినిమాల పరంగా ఎలా ఉన్న కానీ తన పరసనల్ లైఫ్ విషయంలో ధనుష్ మీడియా లో హాట్ టాపిక్ గా మారుతున్నాడు.

రీసెంట్ గానే తన భార్య రజనీకాంత్ కూతురు ఐశ్వర్య తో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డి ధనుష్ మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చాడు. అస్సలు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా తన 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ పెట్టేశారు. దీంతో ధనుష్-ఐశ్వర్య పేరు నెట్టింట మారుమ్రోగిపోతుంది. అయితే ధనుష్ కు వేరే హీరోయిన్ తో ఎఫైర్ ఉందని..ఆమెను దగ్గరకు తీసుకోవడానికే ఐశ్వర్య కి విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ రూమర్ ఎంత వరకు నిజమో తెలియదు కానీ..ఆ వార్త నే నిజం చేస్తూ ధనుష్ ఓ అమ్మాయితో దిగిన ఫోటో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది . దీంతో ఢనుష్ విడాకుల మ్యాటర్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది.

హైదరబాద్ లోని ఓ ప్రముఖ హోటల్‌కు ధనుష్‌ లంచ్‌కి వచ్చాడు. ఈ విషయానే ఆ హోటల్‌ మెనేజ్మెంట్ , ధనుష్‌ సినిమా పీఆర్‌ టీమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాయి. అంత వరకు బాగానే ఉంది. కానీ, ఆ ఫోటోలో ధనుష్ పక్కన ఓ అమ్మాయి కూడా ఉంది. ధనుష్ తో పాటు కలిసి కూర్చుని భోజనం చేస్తుంది. దీంతో నెటిజన్స్ కు కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. ఖచ్చితంగా ఆ అమ్మాయి ధనుష్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నారు. కొందరు ధనుష్ అభిమానులు అయితే పక్కన కూర్చుంటే లవర్ అయిపోతుందా..అంటుంటే వాళ్ళకు కౌంటర్ ఇస్తూ..అసలే విడాకులు మ్యాటర్ తో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన ధనుష్..ఇలంటి టైంలో ఓ అమ్మాయిని పక్కన పెట్టుకుని తిరగడం కరెక్టా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. కాగా ధనుష్‌ విడాకులు ఇటీవల అనౌన్స్‌ చేసిన క్రమంలో ఇలాంటి చర్చలు జరుగుతున్నా .. దీనిపై ధనుష్‌ కానీ ఆయన టీమ్‌ నుండి కానీ ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం గమనార్హం.