షాకింగ్ : స్టార్ హీరోయిన్ గౌతమి భర్త ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

సినిమా హీరోయిన్ పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే అది క్షణాల్లో అందరి చూపు ఆకర్షిస్తోంది. అప్పుడప్పుడు సీనియర్ హీరోయిన్ ల కుటుంబాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు తమిళ స్టార్ హీరోయిన్ గౌతమి గురించి వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. గౌతమి భర్త ఎవరు అనే అంశం పై పలు ఊహాగానాలు చేస్తూ అనేక మంది ఆమె అభిమానులు పోస్టులు పెడుతూండటం గమనార్హం. నటి గౌతమి గురించి అందరికి తెలిసిందే.ఆమె వ్యక్తి గత జీవితం గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగింది తమిళ స్టార్ హీరోయిన్ గౌతమి. దయామయుడు అనే సినిమా తో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. తెలుగులో అంతగా కలిసి రాకపోవడంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

తక్కువ సమయంలోనే తమిళ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోస్ గా కొనసాగుతున్న రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి వారి సరసన నటించి బ్లాక్ బస్టర్ విజయాలని తన ఖాతాలో వేసుకుంది. తనకు వచ్చిన క్రేజ్ తో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రేవతి, భానుప్రియ లాంటి వారిని సైతం అలవోకగా వెనక్కి నెట్టేసింది. ఈ ముద్దుగుమ్మ ఇక వెండితెరపై అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపై కూడా రాణించింది. 1998లో పెళ్లి చేసుకుంది. దీంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ ఒక్క సంవత్సరంలోనే భర్తతో విడాకులు తీసుకుంది. ఇలా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించడం మాత్రం ఆపలేదు.

తర్వాత గౌతమికి కమల్ హాసన్ తో పరిచయం ఏర్పడింది. ఈ విలక్షణ నటుడి తో సహజీవనం మొదలు పెట్టింది హీరోయిన్ గౌతమి.. ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో కూడా నటించారు. కానీ కొన్నాళ్ళకి కమలహాసన్ నన్ను మోసం చేశాడు ఆర్థికంగా వాడుకున్నాడు అంటూ సంచలన ఆరోపణలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక గౌతమి ఒకప్పుడు పెళ్ళి చేసుకుని విడాకులు ఇచ్చిన భర్త ఎవరో కాదు మన అందరికీ తెలిసిన భారతీయ ఫైనాన్షియల్ అనలిస్ట్ సందీప్ భాటియా. ప్రతిరోజు బుల్లితెరపై అనాలసిస్ లో పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులందరికీ సుపరిచితుడిగా మారిపోయారు. సందీప్ మరియు గౌతమి దంపతులకు ఒక కూతురు కూడా పుట్టింది. ఆమె పేరు సుబ్బలక్ష్మి భాటియా.

ఇక గౌతమి తన కూతురు సుబ్బలక్ష్మి ని కూడా సినిమా ఇండస్ట్రీ లోకి తీసుకోస్తుంది అంటూ పలు వార్త ఛానెల్స్ ఎప్పటికప్పుడు వార్తలు ప్రచురితం చేస్తున్న దాంట్లో ఎలాంటి నిజం లేదని, తన కూతురు ఆమె కెరీర్ తో బిజీ గా ఉందని, సినిమాల్లోకి వచ్చే అవకాశమే లేదంటూ క్లారిటీ ఇచ్చింది గౌతమి. ఇక సందీప్ భాటియా తో విడాకులు కమలహాసన్ తో బ్రేకప్ తర్వాత ఇక ఇప్పుడు హీరోయిన్ గౌతమి తన కూతురు తో ఒంటరిగా ఉంటుంది. బ్రేకప్ అనంతరం గౌతమి కి కాన్సర్ సోకడం తో ఆమె ప్రస్తుతం కాన్సర్ ని జయించి పూర్తి ఆరోగ్యవంతురాలిగా మారింది. అంతే కాదు ఆమె ఒక ఫౌండేషన్ ని స్థాపించి తనలాంటి కాన్సర్ బాధితులకు సహాయం చేస్తూ చారిటీ కూడా నిర్వహిస్తుంది.