విజయ్ ఫ్యాన్స్‌కి పంబరేపే న్యూస్..ఇక బాక్సులు పగిలిపోవాల్సిందే..?

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా వాళ్లందరిలోకి విజయ్ దేవరకొండ స్పెషల్. అదేదో సినిమాలో సాయి పల్లవి అన్నట్లు భానుమతి ఒకటే పీస్..అని..ఇక్కడ కూడా విజయ్ దేవరకొండ ఒకటే పీస్. ఇలాంటి హీరో ఇండస్ట్రీకి దొరకడం చాలా కష్టం. అందుకే ఆయనకు విపరీతమైన కేజ్ ఉంది బయట. ఇక ఆయన ఫ్యాన్స్ గురించి అయితే చెప్పనవససరం లేదు. ఇప్పుడు స్టార్ హీరోలుగా ఏలేస్తున్న నటులు..అందరు కూడా ఎన్నో సినిమాలు చేశాక కానీ రానీ ఫ్యాన్ ఫాలోయింగ్..క్రేజ్..విజయ్ ఒకటే సినిమాతో సంపాదించుకున్నాడు. ఆ సినిమానే అర్జున్ రెడ్డి.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవససరం లేదు. నిజం చెప్పాలంటే ఈ సినిమా తరువాతనే విజయ్ దేవరకొండా స్టార్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ హీరోగా విజయ్ దేవరకొండ క్రేజ్ ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా కంటే ముందే ఆయన పెళ్లిచూపులు సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా మంచి పాజిటీవ్ టాక్ దక్కించుకుంది. కానీ అర్జున్ రెడ్డి తరువాతే ఆయన పేరుని అందరు గుర్తుపెట్టుకున్నారు. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ కేక అనే అంటారు అభిమానులు. ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగ్స్..హీరోయిన్ షాలినితో లిప్ లాక్ సీన్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా తరువాత విజయ్ కి మళ్లీ ఈ టైప్ ఆఫ్ సినిమా పడలేదు..ఇంతటి హిట్ మూవీ దక్కలేదు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ‘లైగర్’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే మన ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా తరువాత విజయ్ మళ్ళీ పూరీతోనే జనగణమన అనే సినిమాలో నటిస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లెటేస్ట్ గా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి 2 ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట. ఈ మధ్య కాలంలో చాల హిట్ సినిమాలకు సీక్వెల్ వస్తున్నాయి. ఇదే క్రమంలో అర్జున్ రెడ్డి 2 ను కూడా ప్లాన్ చేస్తున్నారట సందీప్. ఈ సినిమాలో కూడా విజయ్ నే హీరో గా ఫిక్స్ చేసిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజం అయితే ఈసారి అర్జున్ రెడ్డి 2 రికార్డులు తిరగరాస్తుంది అంటున్నారు అభిమానులు. మరి చూడాలి..ఈ సినిమా పై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..?