గౌతమ్ రెడ్డి మరణంతో భీమ్లా నాయక్ కి ఎదురుదెబ్బ..?

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. పవన్ సినిమా వస్తుందటే కోట్లాది అభిమానులు ఎంత ఆశగా ఎదురు చూస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమా మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. దీని పై అఫిషీయల్ గా కూడా ప్రకటన వచ్చేసింది. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవేంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేసింది. ఛీఫ్ గెస్ట్ గా కూడా కేటీఆర్ ను ఫిక్స్ చేస్తూ..చిత్ర బృందం ప్రకటన కూడా విడుదల చేసింది.

దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతూ తమ అభిమాన హీరో ప్రీరీలీజ్ ఈవెంట్ కు వెళ్ళాలి అంటూ అంతా సిద్ధం చేసుకున్నారు. మరి కొద్ది గంటల్లో ఈవెంట్ స్టార్ అవుతుంది అనగా..ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దాంతో పవన్ అభిమానుల ఆశలు నిరాశ గానే మిగిలాయి. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. కొన్ని రోజులుగా ఈ ఈవెంట్ గురించి కళ్ళలో ఒత్తులేసుకుని మరీ వేచి చూసిన ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. కానీ ఏం చేయలేని పరిస్ధితి.

మనందరికి తెలిసిందే ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 9.16 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల నిరాశ గానే అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్థానికులు, కార్యకర్తలు,పలువురు సెలబ్రిటీలు గౌతమ్‌రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేసారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో..నేను నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం నాకు ఇష్టం లేదు..అందుకు నా మనసు అంగీకరించడం లేదంటూ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశారు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను వాయిదా పడింది. కాగా ఈ ఈవెంట్ మళ్లీ ఎప్పుడు జరుగుతుంది ..ఇతర ఇతర విషయాల గురించి త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుంది..’ అంటూ పవన్ తెలిపారు.