ఈ ఒక్క సినిమాతో.. టాలీవుడ్ తలరాత మారిపోయేనా..?

కరోనా తర్వాత టాలీవుడ్ లో పరిస్థితి ఇప్పుడు నెమ్మదిగా మెరుగుపడుతోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటి సారి థియేటర్లను ఓపెన్ చేయడం జరిగింది. అనంతరం వరుస సినిమాలతో విడుదల అవుతూ వస్తున్నాయి. థియేటర్స్ రీ ఓపెన్ అయిన తర్వాత మొదటివారంలోనే ఐదు సినిమాలను విడుదల చేస్తున్నది టాలీవుడ్.

ఇలా విడుదల చేసిన సినిమాలలో ఇష్క్ డిజాస్టర్ గా నిలవగా , తిమ్మరసు, ఎస్ ఆర్ కళ్యాణమండపం హిట్ టాక్ తో నిలబడ్డాయి. ఇక కలెక్షన్ల పరంగా ఎస్ ఆర్ కళ్యాణమండపం బాగా రాబడుతోంది. తెలుగులో వీలైతే సంతానం వంటి చిన్న సినిమాలు సైతం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు నిర్మాతలు. ఆగస్టు 14న పాగల్ సినిమాతో అడుగు పెట్టి, ఆగస్టు19 న సునీల్ క్రైమ్ థ్రిల్లర్ కనబడుట లేదు సినిమా రాబోతోంది. , ఆగస్టు 27 న సుధీర్ బాబు సినిమాను ప్రకటించనున్నారు.

ఇక నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా కూడా వినాయక చవితి పండక్కి విడుదల చేయాలని చూస్తున్నట్లు ప్రచారం. ఈ సినిమా గురించి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలన్నీ విడుదల అవుతాయో . లేదా ..అనే విషయంపై ఎంతో ఆసక్తికరంగా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం కరోనా ముంచుకొస్తుండటంతో కొన్నిచోట్ల థియేటర్లు బంద్ చేస్తున్నట్టు తెలిసింది. అయితే మన ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి ఉండాల్సిందే.

ఇక అంతే కాకుండా గోపీచంద్ నటించిన సిటీ మార్ సినిమా కూడా వినాయక చవితి పండగ సందర్భంగా విడుదల చేయాలని చూస్తున్నారట. ఏది ఏమైనా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా విడుదలవడం వల్ల టాలీవుడ్ కి బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు.