ఆవు పేడతో కోట్ల లాభాలు పొందవచ్చట..?ఎలా..!

హిందువులకు ఆవులు అంటే ఎంతో గౌరవం. అంతేకాకుండా ఆవును గోమాత అని పూజిస్తూ ఉంటాము. అయితే ఆవులో సకల దేవతలు ఉంటాయని కూడా పురాణం నుంచి తెలిసిన విషయమే. ఆవుపాలతో పిల్లలు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆవు మూత్రం ( పంచితం )కూడా ఎన్నో ఔషధాలలో నిండి వుంటుంది.. ఇక ఆవు పేడ పిడకలు తయారు చేసి వంటచెరుకు గా ఉపయోగించడం ఆనాటి కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. అయితే చత్తీస్ ఘడ్ రాష్ట్రం మహిళలకు ఎన్నో విధాలుగా ఉపయోగించేందుకు ఒక పథకాన్ని కూడా అమలు చేశారు..ఆ విశేషాలు ఏంటో చూద్దాం.

చత్తీస్ ఘడ్ ఈ ప్రాంతానికి చెందిన”గోధన్ న్యయ్ యోజన”అనే పథకాన్ని కూడా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పాడి రైతుల నుండి ఆవుపేడను కిలో రెండు రూపాయల చొప్పున స్వీకరించి వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఇది రాజ్ నంద్ గావ్ జిల్లాలోని చౌర్య, కంబాపూర్, గుమ్మ, మరియు కొన్ని ప్రాంతాలలో ఆడవారికి ఆవు పేడ ఆదాయం గా మారింది. గ్రామాలలోని స్వయం ఉపాధి పరంగా ఆవుపేడను, విగ్రహాలు, మొబైల్ ఫోన్ స్టాండ్ లు, నర్సరీ వంటివి ఎన్నో ఉత్పత్తులకు తయారుచేస్తున్నారు. వాటిని మార్కెట్లో చేసి చక్కటి ఆదాయాన్ని విక్రయిస్తున్నారు.

ఇప్పటి వరకు వీటినిమహిళా స్వయం సహాయక బృందాలు తయారుచేసి, రూ.1.5 కోట్ల విలువైన 53,000 క్వింటాళ్ల వర్మి కంపోస్టు అమ్ముడయ్యింది. కానీ ఇంతకు ముందు ఎరువులగా మాత్రమే విక్రయించేవారు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వీటికి నేరుగా డిమాండ్ పెరగడంతో అమెజాన్ వంటి ప్లాట్ ఫాం లో కూడా విక్రయిస్తున్నారు.

ఇక ఉత్తరప్రదేశ్ లో అపర్ణ అనే లాయర్ , ఆవు పేడ వ్యాపారంలో అడుగుపెట్టి తన పది ఎకరాల పొలంలో గోశాలను విస్తరించి దాదాపు 130 ఆవులను పెంచుతుంది. వాటితో ఈమె తయారు చేసిన వస్తువులను విక్రయించగా తన లాయర్ కంటే ఎక్కువ సంపాదన సంపాదిస్తుంది. ఇక అంతే కాకుండా పంజాబ్ లోని పలు గ్రామాల్లోని మహిళలు ఆవుపేడతో బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. ఇక వీరంతా 10 మంది మహిళలకు బృందంగా ఏర్పడి, పిడకలు తయారు చేసి, వాటిని మార్కెట్లో విక్రయించి , మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇక వీరి బాటలోనే ఎందరో మహిళలు కూడా ఇలానే చేస్తున్నారు.