ఈ  C.M. ని ఆదర్శంగా తీసుకుంటే ఒక్క రోజులో దేశం బాగుపడుతుంది….

ఔను  మీరు  విన్నది  నిజమే ఈ  నెల 28 న విడుదల కానున్న నాకు నేనే (తోపు-తురుము), ప్రస్తుతం మన నిజ జీవితం లో  మనందరికీ బాగా తెలిసిన పచ్చి నిజం ఏంటంటే ఎంతో మంది రాజకీయ నాయకులు   వాళ్ళ స్వార్థం కోసం  కుటుంబ సరదాల కోసం  ప్రజా  ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల కష్టాలను కాలరాస్తున్నారు ఇలా తమ బాధ్యతను మరిచి సమాజాన్ని భ్రష్ఠు పట్టిస్తున్న కొన్ని రాజకీయ దుష్ట శక్తులకు బుద్ధి చెప్పే విధంగా.

 ఈ  సినిమా లో  హీరో మొదట్లో ఒక నిజాయితీ గల M.L.A ga  ఆ తరువాత ఒక రాష్ట్రానికి సీ.ఎం అయ్యి    కూడా  ఎటువంటి  హంగు ఆర్భాటాలు లేకుండా అతి సాధారణ మైన జీవితాన్ని గడుపుతూ ప్రజల్లో చైతన్యం తీసుకుని రావటానికి నిద్ర పోతున్న ఈ  సమాజాన్ని మేల్కొల్ప టానికి మంచి కోసం కొన్ని చెడు పథకాలను కూడా ప్రవేశ పెట్టినట్లు ఈ  సినిమా ట్రైలర్స్ చూస్తుంటే అర్థముతుంది. అలా  పెట్టటానికి కారణం కూడా కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాదు ప్రతి పౌరుడికి కూడా సమాజం కోసం ఆలోచించాల్సిన  అవసరం ఉంది.

 అని  చెప్పే ఒక విన్నూత్నమైన కథఅంశం తో  రూపొందించిన  ఈ  చిత్రం ఇప్పటికే ఎన్ని సంచలనాలను సృష్టించిందో మనందరికి తెలిసిన విషయమే. అందుకనే ఇప్పుడు ఈ  సినిమా  పై  అంచనాలు  కూడా  అమాంతం పెరిగిపోయాయి..మరి ఇన్ని అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ  చిత్రం రిలీజ్ తరువాత ఇంకెన్ని సంచలనాలను సృష్టిస్తుందో  చూడాల్సిందే మరి.