సెహ్వాగ్ చెప్పుతో కొట్టాడు.

అవును మైదానంలోనే కాదు మైదానం బయట కూడా సెహ్వాగ్ దూకుడు ముందు మిగిలిన వారు దిగదుడుపే.బ్యాట్ పట్టుకుని ప్రపంచమంతా బౌలర్లకు చుక్కలు చూపి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేలా చేసిన మన డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేందర్ సెహ్వాగ్ ఆటకు వీడ్కోలు చెప్పాక కూడా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు.అయితే ప్రతిసారి సెహ్వాగ్ మన దేశ ఆత్మగౌరం పెరిగేలా చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం.

ఇక అసలు విషయానికి వస్తే పియర్స్ మోర్గాన్ అనే ఇంగ్లాండ్ జర్నలిస్ట్ ట్విట్టర్ వేదికగా 1.2 బిలియన్ జనాభా ఉన్న దేశం లో ఓడిపోయినా ఒలింపిక్స్ లో వచ్చిన 2 పథకాలకు ఇంత సంబరం చేసుకోవడం ఎంత చిరాగ్గా ఉంటుంది అని లెక్చెర్ ఇచ్చారు.అంతే మన వీరూకి చిర్రెత్తుకొచ్చింది..మైదానం లో అయితే బ్యాట్ తో సమాధానం చెప్పేవాడే కానీ ఇక్కడ ట్వీట్ కి ట్వీట్ తోనే సమాధానం చెప్పాడు.

అవును మా భారతీయులం చిన్న చిన్న అందాల్ని కూడా పండుగలా జరుపుకుంటాం.అయితే క్రికెట్ పుట్టి పెరిగే ఇంగ్లాండ్ దేశం ఇప్పటికే ఒక వరల్డ్ కప్ కూడా గెలవకపోగా వరల్డ్ కప్ ఆడుతూనే ఉంటే మాకెంత చిరాగ్గా ఉంటుంది అని ట్వీట్ చేసాడు.ఇదెలా ఉందంటే చెప్పుతో కట్టినా సౌండ్ వస్తుందేమో కానీ సెహ్వాగ్ కొట్టిన చెప్పుదెబ్బ అస్సలు సౌండ్ లేకుండానే చేయాల్సిందంతా చేసేసింది.దట్ ఈజ్ డాషింగ్ అండ్ డేరింగ్ సెహ్వాగ్.

అయితే పియర్స్ అక్కడితో ఆగకుండా కెవిన్ పీటర్సన్ ఆడి ఉంటే, ఇంగ్లండ్ తప్పనిసరిగా ప్రపంచకప్ గెలిచేదని చెప్పాడు.దీనికి సెహ్వాగ్ దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు.అసలు కెవిన్ పీటర్సన్ది ఇంగ్లాండ్ దేశమే కాదని సౌత్ ఆఫీకాలో పుట్టదన్నారు సెహ్వాగ్.అదీగాక 2007 ప్రపంచకప్‌లో కెవిన్ పీటర్సన్ ఆడాడని.. అయినా ఇంగ్లండ్ ఓడిపోయిందని అనడం తో పియర్స్ మోర్గాన్ మైండ్ బ్లాక్ అయింది..అంతే మళ్ళీ మారు మాట మాట్లాడలేదు.