భీమిలిలో టీడీపీ వర్సెస్ జనసేన..అవంతికి అడ్వాంటేజ్.!

భీమిలి నియోజకవర్గం టి‌డి‌పి కంచుకోట…ఇక్కడ 1983 నుంచి 1999 వరకు వరుసగా టి‌డి‌పి గెలిచింది. 2004లో కాంగ్రెస్ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం గెలిచింది. ఇక 2014లో మళ్ళీ టి‌డి‌పి జెండా ఎగిరింది. 2019లో వైసీపీ గెలిచింది. వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ గెలిచారు. ఈయన 9 వేల ఓట్ల తేడాతో గెలిస్తే..జనసేనకు 24 వేల ఓట్లు పడ్డాయి. అంటే జనసేన ఓట్లు చీల్చడం వల్ల టి‌డి‌పికి నష్టం జరిగింది. అయితే ఈ సారి భీమిలిలో పోరు రసవత్తరంగా […]

తణుకులో హోరాహోరీ..అరిమిల్లి వర్సెస్ కారుమూరి..లీడ్ ఎవరిది?

ఈ సారి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీల మధ్య హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ వన్‌సైడ్ గా గెలిచింది..కానీ ఈ సారి టి‌డి‌పి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయింది. అలా అని వైసీపీ తేలికగా వదిలే ఛాన్స్ లేదు. మళ్ళీ టి‌డి‌పిని చితు చేసి గెలవాలని చెప్పి చూస్తుంది. ఈ క్రమంలోనే ఈ సారి తణుకు నియోజకవర్గంలో ఫైట్ హోరాహోరీగా సాగనుంది. గత ఎన్నికల్లో తణుకులో వైసీపీ నుంచి కారుమూరి నాగేశ్వరరావు, […]

విశాఖపై జగన్ ఫోకస్..వైసీపీకి ప్లస్.!

విశాఖని పరిపాలన రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి..జగన్ అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ చేసి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకోస్తున్న విషయం తెలిసిందే. విశాఖని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎలాగో సెప్టెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపై మరింత శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో విశాఖ నుంచి కంపెనీలని తరిమేశారని ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు చెక్ పెట్టేలా జగన్..కొత్తగా విశాఖకు […]

నారాయణకు దెబ్బ మీద దెబ్బ..కవర్ చేయలేకపోతున్నారా?

టి‌డి‌పి సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు ఇంటి పోరు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతుంది. ఆయన తమ్ముడి భార్య చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. తనని మానసికంగా వేధిస్తున్నారని, అర్ధరాత్రి సమయంలో భోజనం తీసుకురావాలని ఇబ్బందులకు గురి చేశారని నారాయణ తమ్ముడి భార్య కృష్ణప్రియ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా ఈ వేధింపుల పర్వం కొనసాగుతోందని, 2019 నాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ప్రచారం చేయాలంటూ నారాయణ తనను అనేక […]

వైసీపీలో ‘ఐ‌ఏ‌ఎస్’ పాలిటిక్స్..సీట్ల కోసం పోటీ?

రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు.సినీ, వ్యాపారం..ఆఖరికి ప్రభుత్వ అధికారులు, ఐ‌ఏ‌ఎస్, ఐ‌పి‌ఎస్..ఇలా ఎవరికైనా రాజకీయాల్లో చోటు ఉంటుంది. ఇక కొంతమంది ప్రజా సేవ చేద్దామని వస్తారు..మరి కొందరు అధికారంతో అందలం ఎక్కాలని వస్తారు. ఇక ఎవరి ఉద్దేశం వారిది. అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులుగా చేసే వారు కొందరు తమ ఉద్యోగాలని వదిలేసి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో పలువురు అధికారులు అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి సీన్ […]

అద్దంకిలో గొట్టిపాటి దూకుడు..చైతన్య బ్రేక్ వేస్తారా?

రాష్ట్రంలో పార్టీ గాలితో సంబంధం లేకుండా గెలిచే నాయకుల్లో గొట్టిపాటి రవికుమార్ ఒకరని చెప్పవచ్చు. 2009 నుంచి ఆయన వరుసగా అద్దంకి నియోజకవర్గంలో సత్తా చాటుతున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆయన..2014లో వైసీపీలోకి వెళ్ళి గెలిచారు. అప్పుడు టి‌డి‌పి అధికారంలోకి వచ్చింది. తర్వాత టి‌డి‌పిలోకి వచ్చిన ఆయన..2019 ఎన్నికల్లో మళ్ళీ గెలిచారు. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇలా పార్టీ బలంతో పాటు తన సొంత ఇమేజ్ తో గొట్టిపాటి గెలుస్తూ వస్తున్నారు. ఆయనకు […]

సాయిరెడ్డి ఎటాకింగ్ పాలిటిక్స్..ఆ మూడు జిల్లాల్లో కలిసొస్తుందా?

వైసీపీలో విజయసాయిరెడ్డి పాత్ర ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. పార్టీ మొదట నుంచి ఆయన పనిచేస్తూ వస్తున్నారు. అన్నిటిలోనూ జగన్ వెంట నడుస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ మంచి విజయాన్ని అందుకోవడానికి సాయిరెడ్డి కష్టం కూడా ఉంది. ఎందుకంటే 2014లో ఉత్తరాంధ్రలో వైసీపీ దారుణంగా ఓడింది. పైగా విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు నుంచి ఉత్తరాంధ్రలో వైసీపీ సత్తా చాటడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బలమైన టి‌డి‌పికి చెక్ పెట్టి అనూహ్యంగా […]

పల్నాడుపై వైసీపీ పట్టు..ఈ సారి ఎన్ని సీట్లంటే.!

పోరాటాల పురిటిగడ్డ పల్నాడులో ఈ సారి రాజకీయం హోరాహోరీగా జరిగేలా ఉంది. ఇటీవల కాలంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరుగుతున్న ఘర్షణలు రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అయితే అధికార బలం ఉండటంతో వైసీపీ పై చేయి సాధిస్తుంది. మొదట నుంచి మాచర్లలో వైసీపీ-టి‌డి‌పిల మధ్య ఫైట్ ఓ రేంజ్ లో నడుస్తుంది. అటు ఈ మధ్య పెదకూరపాడులో ఎమ్మెల్యే శంకర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ల […]

నారాయణకు ఇంటి పోరు..స్కెచ్ ఉందా?

మాజీ మంత్రి నారాయణ ఎప్పుడు ఏదొక వివాదంలో కనిపిస్తూనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన టార్గెట్ గా రాజకీయం నడుస్తూనే ఉంది. నారాయణ ఓడిపోయాక రాజకీయాలకు దూరం జరిగిన..ఆయన చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని అసైన్డ్ భూముల విషయంలో ఆయనపై సి‌ఐ‌డి కేసులు ఉన్నాయి. ఇటు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి టెన్త్ పేపర్ లీకేజ్ కేసు ఉంది. ఇలా రకరకాల కేసులు ఆయనపై ఉన్నాయి. అయితే ఇటీవల […]