టీఆర్ఎస్ లో కొత్త ముసలం.. కెసిఆర్ పై ఫైర్ అయ్యిన మంత్రులు

తెలంగాణ ప్ర‌భుత్వం రెండు రోజుల క్రితం ఒకేసారి ఏకంగా 10 కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ను భ‌ర్తీ చేసింది. ఈ 10 మంది చైర్మ‌న్ల‌లో 5 గురు మైనార్టీ వ‌ర్గానికే చెందిన వారు కావ‌డం విశేషం. అయితే ఈ నియామ‌కాల ప‌ట్ల టీఆర్ఎస్‌లో పెద్ద ముస‌లం మొద‌లైంది. వీరిలో చాలా మంది పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ‌ని వారితో పాటు అనామ‌కుల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టార‌ని ముగ్గురు మంత్రులు మిన‌హా మిగిలిన వారంతా తీవ్ర‌స్థాయిలో అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారని తెలుస్తోంది. కొంద‌రు మంత్రులైతే ఏకంగా […]

కేసీఆర్ మైండ్ గేమ్: తెలంగాణలో 2018లోనే ఎన్నికలు

కేసీఆర్ దూకుడు పెంచారు. త‌న‌పై విప‌క్షాల నుంచి ఎదురువుతున్న ముప్పేట దాడి నేప‌థ్యంలో మ‌రింత చురుగ్గా వ్య‌వ‌హ‌రించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. విద్యార్థుల‌కు ఫీజ్ రీయింబ‌ర్స్ మెంట్ స‌హా ఉద్యోగుల‌కు ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగాలు, గొర్రెల పంపకం వంటి కార్య‌క్ర‌మాల‌తో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి వెళ్లి విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో 2018లోనే ఎన్నిక‌లు నిర్వ‌హించేలా ప్లాన్-బి(బిఫోర్‌)ను అమ‌లు చేయాల‌ని చూస్తున్నార‌ట‌. వాస్త‌వానికి తెలంగాణ‌లో 2019లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంటుంది. […]

కోదండరాంకి రోజు రోజుకి పెరుగుతున్న క్రేజ్ …!

తెలంగాణ ఉద్య‌మ పోరులో త‌న‌కంటూ ఓ అధ్యాయాన్ని సొంతం చేసుకున్న ఉస్మానియా ప్రొఫెస‌ర్ కోదండ రాం.. ఉద్య‌మ స‌మ‌యంలో మేధావుల‌ను క‌దిలించిన తీరు న‌భూతో.. ! అయితే, నాటి ఉద్య‌మ నేత‌ల్లో చాలా మంది కేసీఆర్ పంచ‌న చేరి ప‌ద‌వుల్లో విలాస జీవితాలు గ‌డుపుతుంటే.. కోదండ‌రాం మాత్రం ప్ర‌జ‌ల ప‌క్షాన ఇంకా పోరాడుతూనే ఉండ‌డం నిజంగా హ‌ర్ష‌ణీయం. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న ఊహించ‌ని విధంగా కేసీఆర్‌పై ఉద్య‌మ బావుటా ఎగ‌రేశారు. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నిర్వ‌సితులు, రైతులు, రీయింబ‌ర్స్‌మెంట్, సీఎం […]

మైహోం చేతికి భద్రాద్రి పాలనా పగ్గాలు

తెలంగాణ‌లో తిరుమ‌లలా ప్ర‌సిద్ధి చెందిన భ‌ద్రాద్రి జిల్లా సీతారామ‌చంద్ర‌మూర్తి ఆల‌యం(భ‌ద్రాద్రి ఆల‌యం) పాల‌నా ప‌గ్గాలు త్వ‌ర‌లోనే మై హోం వ్య‌వ‌స్థాప‌కుడు జూప‌ల్లి రామేశ్వ‌ర‌రావుకు అంద‌నున్నాయ‌ట‌! ఆయ‌న‌ను చిన జీయ‌ర్ స్వామి సిఫార్సు చేశార‌ని, దీనికి సీఎం కేసీఆర్ లాంఛ‌నంగా ఆమోదించార‌ని, త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు వెలువ‌డ నున్నాయ‌ని అంటున్నారు. మొత్తానికి ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు రాజ‌కీయంగా రంగు పులుము కుంటుండ‌డం గ‌మ‌నార్హం. ఎంతో మందిని కాద‌ని రామేశ్వ‌ర‌రావుకు ఈ పోస్టు అప్ప‌గించ‌డంపై అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. జూపల్లి […]

గులాబీ దళంలో ఎమ్మెల్సీ గుబులు

గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ ముచ్చ‌ట మొద‌లైంది. ఇప్పటివ‌రకూ పార్టీలో ఉన్న‌ వారు.. కొత్త‌గా ఎన్నో ఆశ‌ల‌తో  పార్టీల‌తో చేరిన వారితో ఆశావ‌హుల జాబితా అంత‌కంత‌కూ పెరుగుతోంది. రానున్న‌ నాలుగు నెలల్లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. శాసన మండలిలో మార్చి 29న నాలుగు స్థానాలు, మేలో మరో 3 స్థానా లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఎవ‌రి స్థాయిలో వారు అప్పుడే పైర‌వీల‌కు తెర‌తీశారు. త‌మ‌కూ అవ‌కాశం ఇవ్వాల‌ని టీఆర్ఎస్ అధినేత వ‌ద్ద‌కు క్యూ క‌డుతున్నారు. […]