జయ మృతిపై ఎయిమ్స్ రిపోర్టు లో ఏముంది…

`అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం జ‌య‌లలిత మృతిపై అనుమానాలున్నాయి. ఆమెకు ఎలాంటి చికిత్స అందించారో బ‌య‌ట‌కు వెల్ల‌డించాలి` రెండు నెల‌లుగా త‌మిళ‌నాట ఈ మాట‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. జ‌య మ‌ర‌ణంపై సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని డిమాండ్ చేస్తూ.. నిరాహార దీక్ష‌కు దిగుతున్నారు. మ‌రోప‌క్క ప్ర‌జల్లోనూ ఏమూల‌నో `అమ్మ‌` మృతిపై సందేహాలు వినిపిస్తున్న త‌రుణంలో.. ఎయిమ్స్ షాకింగ్ రిపోర్టు ఇచ్చింది. అమ్మ మృతికి సంబంధించిన వివ‌రాలు, ఆమెకు అందించిన చికిత్స వివ‌రాలు వెల్ల‌డించింది. జ‌య మ‌ర‌ణంపై స‌స్పెన్స్‌కు తెర‌దించేందుకు […]

తమిళనాట మరో వారసత్వ కురుక్షేత్రం

త‌మిళ‌నాడులో అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత పాలిటిక్స్ ఎంత వేగంగా మారిపోయాయో తెలిసిందే. ముఖ్యంగా సీఎం సీటు కోసం ఇటు చిన్న‌మ్మ‌.. అటు అమ్మ ఆత్మ‌బంధువు ప‌న్నీర్ సెల్వంల మ‌ధ్య జ‌రిగిన‌ చేప‌ల మార్కెట్ ర‌గ‌డ దేశం మొత్తాన్ని ఉత్కంఠ‌కు గురి చేసింది. ఆ త‌ర్వాత చిన్న‌మ్మ జైలుకెళ్ల‌డం.. ప‌ళ‌ని స్వామి సీఎం కావ‌డం ప‌రిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే… అంత‌టితో పాలిటిక్స్ చ‌ల్లార‌లేదు. త‌న‌కు మ‌ద్ద‌తిచ్చే వారిలో మ‌రోప‌క్క ప‌న్నీర్ ర‌గ‌డ సృష్టిస్తూనే ఉన్నారు. ఇది […]

శశికళ వర్గంపై పోరు ఆగదు … పన్నీరు సెల్వం కొత్త పార్టీ

మ‌డ‌మ తిప్పే అవ‌కాశం లేదంటున్నారు త‌మిళ‌నాడు మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం! శశిక‌ళ వర్గంపై పోరు ఆగ‌దు అని స్ప‌ష్టం చేస్తున్నారు. అసెంబ్లీలో జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌నిస్వామి విజ‌యం సాధించ‌డంతో.. త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై ప‌న్నీర్ వ్యూహాలు ర‌చిస్తున్నారు. త‌న‌పై వేటు ప‌డ‌టం ఖాయ‌మ‌ని నిర్ణ‌యించుకున్న ఆయ‌న‌.. స‌రికొత్త రాజ‌కీయ వేదిక‌ను ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అన్నాడీఎంకేలో కొన‌సాగ‌లేక‌.. డీఎంకేలో చేరే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో సొంతంగా పార్టీ పెట్టాల‌ని నిర్ణయించుకున్నార‌ట‌. పార్టీ పేరు, గుర్తు కూడా ఖరారుచేసిన‌ట్టు […]

ఆ ఈక్వేష‌న్స్‌కు బ‌లైన ప‌న్నీరు సెల్వం

కొద్ది రోజుల క్రితం త‌మిళ‌నాడులో చెల‌రేగిన జ‌ల్లిక‌ట్టు వివాదం కేంద్రం దిగి రావ‌డంతో తెర‌ప‌డింది. ఆ త‌ర్వాత అక్క‌డ స్టార్ట్ అయిన పొలిటిక‌ల్ జల్లికట్టులో చివ‌రి గెలుపు ఎడప్పాడి పళని స్వామి (ఈపీఎస్‌)ని వ‌రిస్తే… ఓ.పన్నీరు సెల్వం (ఓపీఎస్‌) ప‌రాజితుడు అవ్వాల్సి వ‌చ్చింది. దీంతో ఇప్పుడు త‌మిళ జ‌నాలంద‌రూ పాపం ఓపీఎస్ అని అంటున్నారు. ఇక గ‌తంలోనే రెండుసార్లు అమ్మ జ‌య‌ల‌లిత జైలుకు వెళ్ల‌డంతో సీఎం అయిన ప‌న్నీరు సీఎం అయ్యి కొద్ది కాలానికే తిరిగి అమ్మ‌కోసం […]

జయకు వేసిన రూ.100 కోట్ల జరిమానా.. మరి దాని మాటేమిటి?

ఒక వ్య‌క్తికి కోర్టు జ‌రిమానా విధించింది.. తీరా అది క‌ట్టే లోగానే ఆ వ్య‌క్తి చ‌నిపోతే.. ఇప్పుడు ఆ జ‌రిమానా ఎవ‌రు క‌ట్టాలి? అత‌డికి కుటుంబ‌స‌భ్యులు కూడా లేక‌పోతే ఏం చేయాలి?  ఆ జ‌రిమానా ప‌రిస్థితి ఏమిటి? ఇప్పుడు త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత‌కు విధించిన రూ.100కోట్ల ను ఎవ‌రు కట్టాల‌నే అంశంపై చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జ‌య‌ల‌లిత ప్ర‌ధాన దోషిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆమెకు రూ.100కోట్లు జ‌రిమానా […]