పన్నీర్ సీఎం అయితే బీజేపీదే అధికారమా?

ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఆధిప‌త్యం కోసం ప‌రిత‌పిస్తున్న బీజేపీకి త‌మిళ‌నాడు ద్వారా ఆ అవ‌కాశం దక్కిందా?  ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో నెలకొన్న సంక్షోభంలో జోక్యం చేసుకోబోమ‌ని కేంద్రం పైకి చెబుతున్నా.. రిమోట్ కంట్రోల్ మాత్రం త‌న ద‌గ్గ‌రే ఉంచుకోబోతోందా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ముఖ్యంగా గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర రావు ద్వారా పావులు న‌డిపిస్తోంది కేంద్ర నాయక‌త్వం! అమ్మ‌కు న‌మ్మిన బంటు అయిన ప‌న్నీర్ సెల్వానికి మ‌ద్ద‌తు ఇచ్చి తెర వెనుక చ‌క్రం తిప్పేందుకు సిద్ధ‌మ‌వుతోంది. మ‌రి హ‌స్తిన ఆధిప‌త్యాన్నిత‌మిళులు […]

పన్నీర్ వెంట టీడీపీ.. శశికళ వెంట వైకాపా!

త‌మిళ‌నాడు రాజకీయాల్లో సీఎం సీటు కేంద్రంగా రెండు రోజులుగా జ‌రుగుతున్న వివాదం దేశం మొత్తాన్ని ఆక‌ర్షించింది. పురుట్చిత‌లైవి, అమ్మ జ‌య‌ల‌లిత హ‌ఠాన్మ‌ర‌ణంతో ఖాళీ అయిన త‌మిళ‌నాడు సీఎం సీటును ఆప‌ద్ధ‌ర్మ సీఎంగా అమ్మ‌కు అత్యంత విధేయుడు, ఆద‌ర్శ‌ప్రాయుడు అయిన ప‌న్నీర్ సెల్వం త‌మిళ‌నాడుసీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయితే, ఈ సీటుపై క‌న్నేసిన శ‌శిక‌ళ‌.. ప‌న్నీర్‌తో రాజీనామా చేయించి అన్నాడీఎంకు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అంతేకాదు, రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు త‌న‌కు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని ప్ర‌క‌టించుకున్నారు. […]

చిన్నమ్మకు షాక్: పన్నీర్ కు డీఎంకే మద్దతు

త‌మిళ‌నాట సంక్షోభం దిశ‌గా రాజ‌కీయాలు అడుగులు వేస్తున్నాయి. మాజీ సీఎం, దివంగ‌త జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ సీఎం పీఠం ఎక్కేందుకు గ‌ల అన్ని అడ్డంకుల‌ను ఒక్కొక్కటిగా తొల‌గించుకుంటున్నారు. అయితే ఇన్నాళ్లూ శాంతి మార్గాన్ని ఎంచుకున్న మాజీ సీఎం, జ‌యకు న‌మ్మిన బంటు ప‌న్నీర్ సెల్వం ఒక్క‌సారిగా తిరుగుబాటు బావుగా ఎగ‌ర‌వేశారు. శశిక‌ళ‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడా ఉందని చెప్ప‌డంతో శశిక‌ళ వ‌ర్గంలో గుబులు రేకెత్తించారు. అంతేగాక ఇప్పుడు డీఎంకే […]