తుమ్మ‌ల‌పై కేసీఆర్ కోపానికి అర్థాలే వేర‌యా..!

రైతుల మీద వ‌రాల జ‌ల్లులు కురిపిస్తుంటే.. వారంతా రోడ్డెక్కి నిర‌స‌న‌ల‌కు దిగారు! మ‌ద్దతు ప్ర‌క‌టించి అన్నీ ఉచితంగా ఇస్తామ‌ని స్వ‌యంగా సీఎం ప్ర‌క‌టిస్తే.. పంట‌ను మంటల్లో వేశారు!! తెలంగాణ‌లో రైతులంద‌రిపైనా సీఎం కేసీఆర్‌.. వ‌ద్దంటే వ‌రాలు కురిస్తున్నారు. కానీ ఆయ‌న‌కు స‌న్నిహితుడు, మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఇలాకా అయిన ఖ‌మ్మంలో.. మిర్చి రైతులు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేయ‌డం.. స‌ర్కార్‌కు మింగుడు ప‌డ‌టం లేదు. దీంతో ఆ అసంతృప్తిని కేసీఆర్‌.. మ‌రోలా వ్య‌క్తంచేశారు. తుమ్మ‌ల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న శాఖ‌పై […]

కేసీఆర్ మైండ్ గేమ్: తెలంగాణలో 2018లోనే ఎన్నికలు

కేసీఆర్ దూకుడు పెంచారు. త‌న‌పై విప‌క్షాల నుంచి ఎదురువుతున్న ముప్పేట దాడి నేప‌థ్యంలో మ‌రింత చురుగ్గా వ్య‌వ‌హ‌రించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. విద్యార్థుల‌కు ఫీజ్ రీయింబ‌ర్స్ మెంట్ స‌హా ఉద్యోగుల‌కు ఇంక్రిమెంట్లు, కొత్త ఉద్యోగాలు, గొర్రెల పంపకం వంటి కార్య‌క్ర‌మాల‌తో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి వెళ్లి విప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టాల‌ని డిసైడ్ అయ్యారు. అంతేకాదు, ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో 2018లోనే ఎన్నిక‌లు నిర్వ‌హించేలా ప్లాన్-బి(బిఫోర్‌)ను అమ‌లు చేయాల‌ని చూస్తున్నార‌ట‌. వాస్త‌వానికి తెలంగాణ‌లో 2019లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంటుంది. […]

చంద్రబాబును దాటేసిన కేసీఆర్ వృద్ధి లెక్కలు!

దేశంలో ఓ ప‌క్క నోట్ల ర‌ద్దు దెబ్బ‌కి ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప కూలింది. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లూ ఇబ్బందుల్లో ప‌డ్డాయి. అంతేకాదు, నోట్ల ర‌ద్దుతో తెలంగాణ ఆర్థిక వ్య‌వ‌స్థ తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతోంద‌ని పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ఆరోపించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఆ త‌ర్వాత మాట మార్చారు. అయితే, తాజాగా ఆయ‌న లెక్క‌లు కూడా మార్చార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిన్న సీఎం కేసీఆర్ 2016-17 సంవ‌త్స‌రానికి సంబంధించి రాష్ట్ర వృద్ధి […]