ఐవైఆర్‌-చంద్ర‌బాబు.. త‌ప్పెవ‌రిది?

రాష్ట్రంలో 24 గంట‌ల్లో తుఫాను మాదిరి వ‌చ్చి వెళ్లిన ఐవైఆర్ ఫేస్‌బుక్ విమ‌ర్శ‌ల ఉదంతం.. ప్ర‌భావం ఇప్ప‌టితో అయిపోయిందా? లేక ముందు ముందు కూడా చంద్ర‌బాబును, ఆయ‌న ప్ర‌భుత్వాన్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తుందా? ప‌్రస్తుతం ఈ ప్ర‌శ్న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెను సంచ‌ల‌నంగా మారింది. దీనికికార‌ణం ఐవైఆర్ ప్ర‌క‌టించిన‌ట్టు ఆయ‌న రాస్తున్న పుస్త‌మే! త‌న అనుభ‌వ సారంతో ఐవైఆర్ ఓ పుస్త‌కం రాస్తున్నారు. దీనిలో బాబుపై చండ ప్ర‌చండ నిప్పులు కురిపిస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌నేది విశ్లేష‌కుల మాట‌. […]

టీడీపీలో నేడు ఐవైఆర్‌…రేపు వేటు ఎవ‌రిపైనో..!

ఏపీ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఐవైఆర్‌.కృష్ణారావుపై ప్ర‌భుత్వం వేటు వేయ‌డం టీడీపీ వర్గాల్లో పెద్ద క‌ల‌క‌లం రేపుతోంది. కృష్ణారావు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డంతో పాటు చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా వైసీపీ వాళ్లు పెడుతోన్న పోస్టుల‌ను షేర్ చేస్తున్నార‌న్న కార‌ణంతోనే ఆయ‌న్ను ప‌ద‌వి నుంచి తొల‌గించిన‌ట్టు తెలుస్తోంది. కృష్ణారావుపై నిర్దాక్షిణ్యంగా వేటు వేసిన ప్ర‌భుత్వం ఆ స్థానంలో కొత్త చైర్మ‌న్‌గా వేమూరి ఆనంద‌సూర్య‌ను నియ‌మించింది. ఏదేమైనా చంద్ర‌బాబు గీత దాటుతోన్న‌, అవినీతి ఆరోప‌ణ‌లు ఎద‌ర్కొంటోన్న వారి […]

అప్ప‌ట్లో ప‌ర‌కాల‌, ఇప్పుడు ఐవైఆర్ సేమ్ టు సేమ్‌

రాజకీయ పార్టీలు, ప్ర‌భుత్వాల‌కు మేధావుల అవ‌స‌రం ముఖ్యం! ఇది గ‌మ‌నించే కొంత‌మందిని కీల‌క ప‌ద‌వుల్లో నియ‌మిస్తూ ఉంటారు! అయితే వారు ఆ రాజ‌కీయ పార్టీకి, ప్ర‌భుత్వానికి రివ‌ర్స్ అవుతార‌ని ఎవరూ ఊహించి ఉండ‌రు. ప్ర‌స్తుతం ఇలాంటి ప‌రిణామ‌మే ఏపీ రాజ‌కీయాల్లో ఎదురైంది. సీఎం చంద్ర‌బాబు.. ఏరికోరి నియ‌మించుకున్న ఐవైఆర్ కృష్ణారావు.. ప్ర‌భుత్వంపై ఎద‌రుదాడికి దిగ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అంతేగాక ఆయ‌న‌పై వేటు వేసే వ‌ర‌కూ వ్య‌వ‌హారం వెళ్లింది. అయితే ఇలాంటి సంఘ‌ట‌నే ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో […]

ఐవైఆర్ సునామీ… బాబుకు ఝ‌ల‌క్‌..వెనక జరిగిన తతాంగం ఇదేనా..!

ఏపీలో ఇప్పుడు అనూహ్యం, అసాధార‌ణం అన‌ద‌గిన పరిణామాలు వెంట‌వెంట‌నే చోటు చేసేసుకుంటున్నాయి. త‌న మామ‌కు వెన్నుపోటు పోడిచాడు అని విప‌క్షాలు సీఎం చంద్ర‌బాబును త‌ర‌చు విమ‌ర్శిస్తూ ఉంటాయి. దీనిని ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి నేరుగా చంద్ర‌బాబుకు అనుభవంలోకి వ‌చ్చింది. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో బాబు అవాక్క‌యిపోవ‌డం త‌రువాయి అయింది. నిజానికి ఈ ప‌రిణామం ఏ క‌మ్మ‌, కాపు కుల స్తుల నుంచి ఎదురై ఉంటే.. మ‌రో రకంగా ఉండేది. కానీ, బ్రాహ్మ‌ణ కులం […]