మన శంకర వరప్రసాద్ గారు: మెగాస్టార్ కెరీర్ లోనే రికార్డ్ లెవెల్ బిజినెస్.. !

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో రూపొందిస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఇప్పటికే.. ఈ సినిమా ప్రమోషన్ పీక్స్‌ లెవెల్ లో అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుందట. ఇప్పటికే చిరు కెరీర్‌లోనే హైయెస్ట్ రికార్డును క్రియేట్ చేసినట్లు సమాచారం. ఈ భారీ డీల్‌తో నిర్మాత సహుగార‌పాటి రిలీజ్‌కు ముందే లాభాల్లోకి వెళ్లిపోయాడంటూ టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

థియేట్రికల్ బిజినెస్‌తో పాటు.. డిజిట‌ల్ హక్కులకు ఊహించని రేంజ్ లో డిమాండ్ ఏర్పడిందట. దీన్నిబట్టి.. సినిమాపై మార్కెట్లో ఉన్న క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. ఇక అనీల్ మరోసారి.. నిర్మాతలకు స్ట్రాంగ్ సపోర్ట్ గా నిలిచారు. షూటింగ్ టైంలో వర్కర్స్ యూనియన్ స్ట్రైక్ లాంటి అనూహ్య పరిణామాలు కూడా ఎదుర్కొని.. ముందస్తు ప్రణాళికతో షూట్‌ను షెడ్యూల్ కు ముందే కంప్లీట్ చేశారు. దీంతో.. నిర్మాతలకు కోట్ల రూపాయల ఖర్చు తగ్గింది.

Experience the Divine with Chiru & Venky from Mana Shankara Vara Prasad  Garu Sets

సినిమా క్వాలిటీ పై ఎక్కడ రాజీ పడకుండా ప్రాజెక్టును కంప్లీట్ చేశాడు. ఇక.. అనిల్ నుంచి చివరిగా వచ్చిన సంక్రాంతి వస్తున్నాం సైతం ఇండియాలోనే అతిపెద్ద రీజినల్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో.. తన బలాన్ని చూపించిన అనిల్ మన శంకర వరప్రసాద్ గారుతో.. మరోసారి అంతకుమించిపోయే సక్సెస్ కొట్టాలని కసితో ఉన్నాడట. ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథనంతో పండగ వాతావరణం అందించేలా డిజైన్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇప్పటికే.. ప్రమోషన్స్‌తో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్‌ వస్తే చాలు.. ఇక కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అనడంలో సందేహం లేదు.