టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ డ్రాగన్ ప్రస్తుతం సైట్స్ పై షూట్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాకపోయినా.. ఆడియన్స్‌లో మాత్రం అంచనాల ఆకాశానికి అంటుతున్నాయి. కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. సినిమా నుంచి ఓ స్టార్ నటుడు తప్పుకున్నాడంటూ టాక్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. మలయాళ ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్.

ఇప్పటికే మల్టీ టాలెంటెడ్ నటుడుగా భాషతో సంబంధం లేకుండా.. అన్ని ఇండస్ట్రీలోనూ వైవిద్యమైన పాత్రల్లో నటించి మెప్పించాడు. తెలుగు ప్రేక్షకులను సైతం ఫిదా చేశాడు. ఇక బాహుబలి తర్వాత సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న ప్రభాస్‌కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మూవీ సలార్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంతో తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ నటనకు ఎంతలా ప్రశంసలు దక్కాయో.. పృథ్వీరాజ్ సుకుమారానికి కూడా అదే రేంజ్ లో మంచి ఇమేజ్ క్రియేట్ అయింది.

ఇక ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు పృథ్వీరాజ్. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాలోను పృథ్వీరాజ్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఓ కీలక పాత్ర కోసం ఆయనను ఎంచుకున్నాడు. అయితే.. తాజాగా పృథ్వీరాజ్ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేసినట్లు టాక్ నడుస్తుంది. వారణాసి సినిమాతో ప్రస్తుతం పృథ్వీరాజ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ఆ సినిమా పైనే ఉందని.. రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న వారణాసి కోసం డ్రాగన్ సినిమాను వదులుకున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది.

