ప్రతి ఒక్క సామాన్యుడికి ఉండే కామన్ కల ఒక్కసారైనా విమానంలో ప్రయాణించడం. అలాంటి కళ చాలా మందికి నెరవేరదు. కానీ.. సినిమా నటీనటులు మాత్రం సొంతంగా కోట్లు విలువ చేసే ప్రైవేట్ జట్‌లను కొన్ని వాటిలో ట్రిప్స్ ఎంజాయ్ చేస్తు ఉంటారు. అలా ఇప్పటికే మన హీరోలలో చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, ప్రభాస్, హీరోయిన్ నయనతారలకు ఓన్ జెట్లు ఉన్నాయి. అయినా వీళ్లంతా చాలాసార్లు పబ్లిక్ ఫ్లైట్లో జర్నీ చేస్తుంటారు. కానీ.. ప్రభాస్ మాత్రం ఎప్పుడు ప్రైవేట్ జెట్‌లో ప్రయాణం చేయడానికి మక్కువ చూపుతాడు.

దాని వెనుక స్ట్రాంగ్ కారణాలు కూడా ఉంటాయి. కొంతమంది ఈ విషయాన్ని తప్పు పడుతున్నారు. తాజాగా.. ఓ నిర్మాతకు ప్రభాస్ తన టీం కోసం యూఎస్ఏ కి ప్రైవేట్ జట్ బుక్ చేయమని డిమాండ్ చేశాడంటూ వార్తలు వినిపించాయి. అయితే ప్రభాస్ ఎప్పుడు ఇతరుల నుంచి ఏది ఆశించకుండా.. తన మనితో ఏదైనా చేస్తాడని.. సినిమాకు సంబంధించిన షెడ్యూల్ ఉంటే నిర్మాతలు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది.. అంతేకానీ నిర్మాతలతో అనవసరమైన ఖర్చులు పెట్టించే టైప్ కాదు ప్రభాస్ అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం.. స్పిరిట్, రాజాసాబ్, సలార్ 2, కల్కి 2 సినిమాలతో బిజీ. ఒక్కో సినిమాలో ఒక్క గెటప్ లో ఆయన కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే ఆయన తన లుక్ రివీల్ కాకూడదని ఉద్దేశంతోనే మేకర్స్ కు ప్రైవేట్ జెట్ బుక్ చేయమని చెప్తూ ఉంటారట. అనుకోకుండా పబ్లిక్ లో వెళ్లాల్సి వస్తే.. లుక్ వైరల్ గా మారిపోతుంది. ఈ క్రమంలోనే తాను ప్రైవేట్ జట్ జర్నీకి ఇంపార్టెన్స్ ఇస్తాడని సమాచారం. గతంలో.. ఆది పురుష్ రిలీజ్‌కు ముందు ప్రభాస్ బయట కనిపించడం.. కొందరు ఫోటోలు తీసి వైరల్ చేయడంతో అది నేషనల్ లెవెల్ లో ట్రోల్లింగ్స్‌కు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వాటికి దూరంగా ఉండడానికి పబ్లిక్ ఫ్టైట్‌లలో జర్నీ చేసేందుకు ఆయన ఇష్టపడాడట.

