సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉంటారు అయితే ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి నటిస్తే బాగుంటుందని రకరకాల డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఆడియన్స్ మదిలో మెదులుతూ ఉంటాయి. అలాంటి వాటిలో టాలీవుడ్‌లో చిరంజీవి – బాలయ్య కాంబినేషన్ కూడా ఒకటి. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు అది వర్కౌట్ కాలేదు. కాగా.. తొలిసారి ఆ భారీ ప్రాజెక్ట్ కోసం పెద్ద ప్లానింగ్ జరుగుతుందట. కనివిని ఎరుగని రేంజ్‌లో ఇండస్ట్రీకి గూస్ బంప్స్ తెప్పించేలా ఆ ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకురావడానికి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఒకరు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
చిరు – బాలయ్య ఇద్దరు ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఎవరి సినిమాలతో వాళ్లు పోటీ పడుతూ ఉంటారు. చాలాసార్లు సంక్రాంతి బరిలోనూ వీళ్ళిద్దరి మధ్య స్ట్రాంగ్ వార్ నెలకొంది. ఆ టైంలో హీరోల కంటే వీళ్ళిద్దరి ఫ్యాన్స్ మధ్యనే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉండేది. ఎంతమంది పాన్ ఇండియన్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నా సరే.. బాలయ్య – చిరు మధ్యన పోటీ అంటే మాత్రం ఆడియన్స్‌లో ఆసక్తి.. నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే.. బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకరికి ఒకరు స్ట్రాంగ్ పోటీ ఇచ్చుకునే ఇద్దరు హీరోలు కలిసి.. ఓ మల్టీ స్టారర్ నటిస్తే ఎలా ఉంటుంది.. అలాంటి భారీ ప్రాజెక్టును త్వరలో సెట్స్ పైకి తీసుకురావాలని ప్లాన్స్ జరుగుతున్నాయట. దానికి మేకర్స్ కూడా సిద్ధమవుతున్నారని సమాచారం. ఇంతకీ స్టార్ ప్రొడ్యూసర్ మరెవరో కాదు అల్లు అరవింద్. ఎస్.. ఈ క్రేజీ కాంబినేషన్‌కు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడట.
ఇద్దరితోను చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. భారీ లెవెల్‌లో ఈ ప్రాజెక్ట్ రూపొందించేందుకు సిద్ధం చేస్తున్నాడని.. ప్రస్తుతం దీనికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక.. ఈ ప్రాజెక్టు రేంజ్ కు తగ్గట్టు కథ కోసం ఇద్దరు ముగ్గురు స్టార్ట్ డైరెక్టర్ లతో డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఇటీవల డైరెక్టర్ అనిల్ రావిపూడి, బోయపాటి పేర్లు కూడా వినిపించాయి. వీళ్లతోపాటు.. మరి కొంతమంది యంగ్ డైరెక్టర్‌లతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే.. ఇదంతా కేవలం ప్రాథమిక దశలో ఉంది.

ముందు చిరు – బాలయ్య కలిసి నటించేందుకు ఒప్పుకుంటారా.. లేదా.. అనేది బిగ్ క్వస్షన్. ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే దాన్ని మించిన సినిమా మరొకటి ఉండదు. పవన్, ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలు సైతం పక్కకి వెళ్లిపోతాయి. ఇక ఈ సినిమా సెట్స్‌పైకి వచ్చిందంటే.. ఆడియన్స్ లో అంచనాలు ఆకాశాన్నికంట్టుతాయి. ఈ క్రమంలోనే.. భారీ బిజినెస్ కూడా జరుగుతుంది. అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. థియేటర్లలో అసలు సిసలు పండగ వాతావరణం మొదలవుతుంది. మరి.. వీళ్లిద్దరి కోసం అలాంటి దమ్మున్న కథను డైరెక్టర్స్ అందించాల్సి ఉంది. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా ఎప్పటికి అనౌన్స్ చేస్తారో చూడాలి.


