ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మల్టీ స్టారర్‌ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలకు ఆడియన్స్ సైతం బ్రహ్మరధం పడుతున్నారు. ఒకే సినిమాలో.. ఇద్దరు హీరోలు అడుగుపెట్టి నటిస్తున్నారంటే చాలు ఆ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. గతంలో.. ఇద్దరు హీరోలను పెట్టి ఓ సినిమా తీయాలంటే దర్శక, నిర్మాతలు చాలా ఆలోచించేవారు. భయపడి పోయేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం అది చాలా కామన్ అయిపోయింది. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత.. ఈ జనరేషన్ సూపర్‌స్టార్స్ అంతా కలిసి ఒకే సినిమాలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే.. త్వరలో మరో క్రేజీ మల్టీ స్టారర్ సెట్స్ పైకి రానుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఓ ముఖ్యమైన క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ మెరవనున్నట్లు సమాచారం. ఈ విషయంపై తాజాగా తారక్ ను సంప్రదించినట్లు టాక్.. ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారుతుంది. ఇంతకీ వీళ్ళిద్దరికి కాంబో మూవీకు దర్శకుడు మరెవరో కాదు.. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. రీసెంట్గా కూలీ సినిమాతో యావరేజ్ టాక్‌ను దక్కించుకున్న లోకేష్ ఇప్పుడు.. మన టాలీవుడ్ హీరోలతో హిట్ కొట్టేందుకు భారీ ప్లాన్ చేస్తున్నాడట. మొదట పవన్ కళ్యాణ్ కు స్టోరీ వినిపించిన లోకేష్.. ఆయనతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇప్పించుకున్నాడట.
ఈ సినిమాను కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటూ అఫీషియల్ గా ప్రకటించనున్నారని తెలుస్తుంది. అలాగే.. లోకేష్ – ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్‌కు కూడా ఓ స్టోరీని చెప్పాడట. అది ఆయనకు బాగా నచ్చేసిందని.. మెయిన్ లీడ్‌గా అల్లు అర్జున్ నటిస్తుంటే.. సెకండ్ హీరోగా ఎన్టీఆర్ కనిపించనున్నాడని.. ఆయన క్యారెక్టర్ కూడా చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందంటూ టాక్ వైరల్‌గా మారుతుంది. ఈ క్రమంలోనే.. తారక్‌ను తాజాగా లోకేష్ అప్లోడ్ చేయడానికి ఎలాంటి సిగ్నల్ వస్తుందో అని అంత ఎదురు చూస్తున్నారు. ఇక బన్నీ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తే.. ఎన్టీఆర్ నో చెప్పాడు అనడంలో సందేహం లేదు. ఇక ముందు ముందు ఏం జరగబోతుందో చూడాలి.



