పవన్ కోసం చరణ్ త్యాగం.. పవర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్‌ సర్వే గంగా కంప్లీట్ చేసుకుంటున్నా సంగతి తెలిసిందే. 2026 మార్చ్ 26న సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కాబోతుందని మేకర్స్‌ ప్రకటించారు. అదే రోజు నాని పారడైజ్‌ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అయితే.. ఆ సమయానికి రెండు సినిమాల్లో ఏది రిలీజ్ అవుతుందో.. ఏది వాయిదా పడుతుందో తెలియదు. ఇలాంటి టైంలో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ అదే డేట్‌కు ఎంట్రీ ఇవ్వ‌నున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది.

Peddi First Teaser Out! Ram Charan Starrer Sets Up First Box Office Clash  Of 2026 With Nani's The Paradise | Republic World

ప్రస్తుతం పవర్ స్టార్, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఊహించిన హైప్‌ లేకపోయినా.. ఇది రీమేక్ కాదని తెలియడం.. తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ పాజిటివ్ రిజల్ట్ అందుకోవడంతో.. సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. ఇక.. ఇప్పటికే ఉస్తాద్‌ భగత్ సింగ్ షూట్‌ను కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గ‌డుపుతున్నారు టీం. ఇక.. తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం ఉస్తాద్‌ భగత్ సింగ్‌ను మార్చి 26 కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

Pawan Kalyan striking poster from Ustaad Bhagat Singh

ఉస్తాద్ షూట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడం.. మరో పక్క పెద్ది ది పారడైజ్ సినిమాల షూట్ కూడా కంప్లీట్ కాకపోవడంతో.. మార్చి 26న పవన్ రంగంలోకి దిగుతాడని.. మిగతా రెండు సినిమాలు వాయిదా పడతాయని సమాచారం. పవన్ సినిమా వస్తుందంటే అది సక్సెస్ అయినా.. అవ్వకపోయినా మిగతా సినిమాలు చాలావరకు పక్కకు తప్పుకుంటాయి. ఇక చరణ్.. కచ్చితంగా బాబాయ్ సినిమా కోసం సైలెంట్ అయిపోతాడు. దీంతో.. పెద్ది, పారడైజ్ సినిమాలు సమ్మర్ లేదా ఏప్రిల్ లో రిలీజ్ అవుతాయని అంటున్నారు. చివరిగా.. ఓజీ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ కొట్టిన పవన్ ఫ్యాన్స్.. ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారో చూడాలి.