బుక్ మై షో టికెట్ బుకింగ్స్ లో ప్రభంజనం.. సంక్రాంతి బరిలో ఆ సినిమానే టాప్..!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాల్లో వెంకీ మామ సంక్రాంతి వస్తున్నాం ఒకటి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం భారీ వ‌సూళ్ళ‌తో దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది. బుక్ మై షో ట్రాకింగ్ ప్రకారం సినిమా రిలీజైన కొద్ది గంటల్లోనే 8,390 టికెట్లు విక్రయించి పండుగ సెలబ్రేషన్స్ ను మరింత హైలెట్ చేసింది. ఇక బాలయ్య నటించిన డాకుమారో జనవరి 12న రిలీజ్ అయి మంచి వాసుళ‌ను సొంతం చేసుకుంది.

మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్‌తో ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించింది. ఇక నిన్న ఒక్క గంటలు 3,380 టికెట్లు బుక్ మై షో లో అమ్ముడుపోయాయ‌ని స‌మాచారం. సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటు గేమ్ ఛేంజ‌ర్‌ జనవరి 10న మంచి వ‌సూళ్ళే సాధించినా.. రెండో రోజు నుంచే వసూళ్ళు తగ్గుముఖం పట్టడం ప్రారంభమయ్యాయి. ఇక నిన్న గంటలో ఈ సినిమాకు కేవలం 1,810 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. టాక్ బలంగా లేకపోవడం సంక్రాంతి బ‌రిలో కొత్త సినిమాలు రావడంతో గేమ్ ఛేంజ‌ర్‌పై నెగటివ్ ప్రభావం పడింది. సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్‌ను పూర్తిగా ఆకట్టుకుంది.

కాగా ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. పండగ సీజన్లో ఫ్యామిలీ సినిమాలకు ఉన్న డిమాండ్ ఈ సినిమాకు మరింత బలాన్ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా బుక్ మై షో లో గంటకోసారి టికెట్ సేల్స్ ట్రాకింగ్ చూస్తుంటే.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద మాస్ హ‌వాను కొనసాగిస్తుండగా.. బాలయ్య మాస్ ఫాలోయింగ్, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని క్లియర్ గా అర్థమవుతుంది. పండగ సీజన్ లో ఈ సినిమా కూడా మంచి వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు వివరించాయి. ఇక టికెట్ ట్రాకింగ్ వివరాల ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం 8,390 టికెట్లు గంటకు కొనుగోలు కాగా.. డాకు మహారాజ్ కి 3,380 టికెట్లు కొనుగోలు అయ్యాయి. గేమ్ ఛేంజ‌ర్‌కు అన్నిటికంటే తక్కువగా 1,810 టికెట్లు కొనుగోలు అయినట్లు తెలుస్తుంది.