” గేమ్ ఛేంజర్ ” రిజల్ట్ పై  ఫస్ట్ టైం రియాక్ట్ అయిన చరణ్.. ఏం చెప్పాడంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్, శంకర్ కాంబినేషన్లో రిలీజైన‌ గేమ్ ఛేంజ‌ర్‌ మూవీ థియేటర్లలో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాపై రకరకలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సినిమా రిజల్ట్ పై చరణ రియాక్ట్ అయ్యారు. చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజ‌ర్‌ సంక్రాంతి బరిలో మిక్స్డ్‌ సెట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పొంగల్ కావడంతో సినిమా బాగానే రన్ అవుతుందని.. కలెక్షన్లు డీసెంట్ గానే వస్తున్నాయని సమాచారం. అయితే సినిమా రేంజ్‌తో పోలిస్తే బాగా తక్కువ కలెక్షన్లు రాబడుతుందట. సినిమాపై దారుణంగా నెగెటివిటీ స్ప్రెడ్ అవ్వడం.. ఇతర హీరోల అభిమానులు.. గేమ్ ఛేంజ‌ర్‌ను ట్రోల్ చేయడం ఈ సినిమాకు మైనస్ అయిందని తెలుస్తోంది. బన్నీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వాళ్ళ‌లో ఉన్నట్లు సమాచారం.

అంతేకాదు హెచ్చ్‌డీ ప్రింట్‌ని కూడా కొందరు కావాలని లీక్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమాను డామేజ్ చేసేందుకు కుట్రలు చేసినట్లు టీం వివరించింది. వారిపై సైబర్ క్రైమ్ కి కూడా ఫిర్యాదు చేశారు మేకర్స్. నిజంగానే ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఉన్నారా.. లేదా ఫ్యాన్స్ ముసుగులో మరెవరైనా ఈ కుట్ర చేస్తున్నారా అనేది తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాలి. అయితే ఇటీవల కాలంలో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న క్రమంలో ఇలాంటివన్నీ కామన్ గా జరుగుతున్నాయి. ఈ సినిమా నిర్మాతలకు పెద్ద దెబ్బగా మారుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సినిమా రిజ‌ల్ట్ పై రామ్ చరణ్ రియాక్ట్ అయ్యారు. ఆయన సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, మీడియా, ఆడియన్స్ కు ధన్యవాదాలు తెలియజేశాడు.

ఈ సంక్రాంతికి తన హృదయం ఆనందంతో నిండిపోయిందని.. గేమ్ ఛేంజ‌ర్‌ కోసం మేం పడ్డ కష్టం కనిపించిందని.. మనస్పూర్తిగా మూవీ టీం కి, క్యాస్ట్ కు, అలాగే సక్సెస్ లో భాగమైన ఆడియన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. మీరు నాపై చూపిస్తున్న అమితమైన ప్రేమ, అభిమానం, సహకారం చాలా ఎక్కువ అని చెప్పుకొచ్చిన చరణ్.. మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. మీ రివ్యూల ద్వారా మా సినిమాకు ఎంకరేజ్మెంట్ అందించిన తీరు బాగుంది. సినిమా సక్సెస్ లో భాగమైందని.. ఈ ఏడాది పాజిటివిటీతో స్వాగతం పలకడం హ్యాపీగా అనిపిస్తుందని చరణ్ వెల్లడించాడు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కు ప్రామిస్ చేస్తున్న నేను నటనతో మిమ్మల్ని ఎప్పటికీ గర్వించేలా చేస్తా. గేమ్ ఛేంజ‌ర్‌ మూవీకి నా హార్ట్‌లో ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. మీ అమితమైన ప్రేమకి మరోసారి ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ తెలియజేశాడు. అంతేకాదు సినిమా డైరెక్టర్ శంకర్‌కు నా ధన్యవాదాలు అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం చరణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.