ఒక్క హిట్ తో భారీ క్రేజ్.. సీనియర్ హీరోలందరి చూపు ఆమె వైపే..

ఇటీవల నాగార్జున నా స్వామి రంగా సినిమాతో హిట్ అందుకుంది ఆషిక రంగ‌నాధ్‌. ఇక ఒక్క సినిమా హిట్ అయింది అంటే మన టాలీవుడ్ డైరెక్టర్స్ అంతా ఆ హీరోయిన్నే కావాలని వెంటపడుతూ ఉంటారు. అయితే నాగార్జున లాంటి సీనియర్ హీరోను డామినేట్ చేసి మరి ఆషిక త‌న‌ నటనతో ఆకట్టుకోవడంతో ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల‌ అందరికీ ఆషిక మంచి ఆప్షన్ అయిపోయింది. అవ్వడానికి కుర్ర హీరోయిన్ అయినా సీనియర్ హీరోలకు సరిగ్గా సెట్ అవుతుందని అభిప్రాయం వారిలో మొదలైంది.

Enno Ratrulosthayi Video Song and Snaps From Amigos Featuring Nandamuri  Kalyan Ram and Ashika Ranganath – Cine Media Stars

మొదట కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాలో నటించిన ఆ సినిమా అంతగా ప్రభావితం చూపకపోవడంతో ఈమెకు సక్సెస్ రాలేదు. ఇక నా సామిరంగాతో హిట్ కొట్టి టాలీవుడ్‌లో రెండో సినిమాతోనే భారి క్రేజ్‌ను సంపాదించుకుంది. కాగా మొదట కన్నడలో 2016లో రౌడీ బాయ్స్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ స‌ర‌సన ఓ మూవీలో నటించి ఆకట్టుకుంది.

మొత్తం కన్నడలో 15 సినిమాలు పైగా నటించిన ఆషిక.. అక్కడ కూడా సీనియర్ హీరోలతో నటించి మెప్పించడంతో సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ జోడి అని అభిప్రాయం అందరిలోనూ నెలకొంది. మధ్యలో ఓ మలయాళ సినిమాలో కూడా నటించింది. మెల్లమెల్లగా సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకున్న ఆషికా రంగనాథ్ ఫ్యూచర్‌లో పాన్ ఇండియా సినిమాలు కూడా నటించాలని ఆమె ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.