చలికాలంలో అరటి పండును తినవచ్చా? తినకూడదా? క్లారిటీ

సాధారణంగా చాలామంది అరటి పండ్లను ఇష్టపడుతూ ఉంటారు. వీటిలో ఉండే తీపిదనం ద్వారా అరటి పండ్లను ఎక్కువగా తింటారు. మరి చలికాలంలో వీటిని తినవచ్చా? తినకూడదా? అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. చలికాలంలో అరటి పండ్లను తింటే జలుబు మరియు కఫం చేస్తుందని అంటారు.

పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం చలికాలంలో కూడా అరటి పండ్లను తినవచ్చు. కాకపోతే రాత్రిపూట పడుకోబోయే ముందు మాత్రం అరటిపండును దూరం పెట్టడం మంచిది. అరటి పండును తినడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. అదే చలికాలంలో తినడం ద్వారా జీర్ణశక్తి తగ్గుతుంది.

అరటిపండ్లు తినడం వల్ల నిద్రలేమి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే చలికాలంలో మాత్రం రోజుకు ఒక అరటిపండుతోనే ఆపడం మంచిది. చలికాలంలో నీరసంగా అనిపిస్తున్నప్పుడు వెంటనే అరటిపండును తినాలి. చలికాలంలో అరటిపండును తినవచ్చు కానీ మితంగా తినాలి. రోజుకి ఒక అరటిపండు కంటే ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.