యాలుకలతో ఇన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చా.. తప్పక రోజు తీసుకోండి..?!

మనం సుగంధ ద్రవ్యాలుగా తీసుకునే ఆహారంలో యాలుకలు కూడా ఒకటి. ఇవి ఆహారంకి రుచులు జోడించడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివన్ని నిపుణులు చెబుతున్నారు. వీటిని రోజు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట. స్థూలకాయం ఉన్నవారు రాత్రిపూట గోరువెచ్చని నీళ్లలో యాలుకలు వేసుకుని త్రాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అని నిపుణులు చెప్తున్నారు.

అంతేకాదు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని కూడా యాలుకలు తగ్గిస్తాయట. యాలుకల‌ను తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుందని, అధిక రక్తపోటు మరియు శ్వాస కోసం సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని.. నిద్రలేమితో బాధపడే వారికి యాలుకలు మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు. కిడ్నీలోని మలినాలను తొలగించేందుకు కూడా ఇది సహయ‌కారిగా పనిచేస్తుంది.

యాలుకలు చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుంది. క్యాన్సర్ తలెత్తకుండా ఉంటుంది. కడుపులో మంట, కడుపులో నొప్పి, గ్యాస్ సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ఇక రోజు వీటిని తీసుకోవడం వల్ల గుండె సమస్యలకు కూడా దూరంగా ఉండవచ్చు.