యూపీ సీఎం ఆదిత్యనాథ్ ను కలిసిన ‘ హనుమాన్ ‘ టీం.. కారణం ఏంటంటే..?

పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన మొట్టమొదటి తెలుగు సూపర్ మాన్ స్టోరీ హనుమాన్. ఇప్పటికి ఈ మూవీ అదే క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బ‌రిలో రిలీజైన ఈ సినిమా రూ.200 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి సంక్రాంతి విజేతగా నిలిచింది. కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లోను హనుమాన్‌కు భారీ పాపులారిటీ దక్కుతుంది. ఈ నేపథ్యంలో హనుమాన్ టీం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. హీరో తేజ స‌జ్జ‌, డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో పాటు కొంతమంది మర్యాదపూర్వకంగా యోగిని కలిసి హనుమాన్ విశేషాలను.. తమకు వస్తున్న రెస్పాన్స్ ను సీఎంకు వివరించారు.

HanuMan (Hindi Dubbed) - Apollo Cinema

అలాగే తేజా.. యోగి ఆదిత్యనాథ్‌ను కలవడం ఎంతో ఆనందంగా ఉందని.. యోగేజీని కలవడం పెద్ద గౌరవం అంటూ వివరించాడు. హనుమాన్ మేకర్స్ యోగి ల భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్ర‌శాంత్ మాట్లాడుతూ.. మిమ్మల్ని కలవడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను సార్‌.. హ‌నుమాన్‌ని రూపొందించడంలో మా ప్రయత్నాలకు మీ ప్రోత్సాహం మరియు గుర్తింపు నిజంగా స్ఫూర్తిదాయకం.. సినిమాల్లో సంప్రదాయం మరియు ఆవిష్కరణల కలయికకు విలువనిచ్చే నాయకుడిని చూసి వినయంతో, కొత్త పుంతలు తొక్కడం కొనసాగించడానికి మద్దతు ఇచ్చినందుకు మరియు మమ్మల్ని ప్రేరేపించినందుకు కృతజ్ఞతలు అంటూ వివ‌రించాడు.

Prasanth Varma announces HanuMan sequel on Ram Mandir Pran Pratishtha -  Hindustan Times

ఇక‌ ఈ సినిమా ప్రతి టికెట్ నుంచి రూ.5 రామమందిరానికి విరాళం అందజేస్తామని ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకర్స్ ప్రకటించారు. దీనిలో భాగంగానే సినిమా టికెట్ల నుంచి వచ్చిన డబ్బులో రూ2. 66 కోట్ల‌ వరకు రామ మందిరం నిర్మాణానికి విరాళంగా అందజేశారు హనుమన్‌ టీం. దీంతో వీరిపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఇక తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు జై హనుమాన్ టైటిల్ ప్రకటించిన డైరెక్టర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేశాడు. ఈ సినిమా 2025లో రిలీజ్ కానుంది.