కుర్చీ తాత అరెస్ట్.. మ‌హేష్ బాబు వ‌ల్లే అంటూ.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

గతంలో తెలంగాణ ఎలక్షన్స్ నేపథ్యంలో మాట్లాడుతూ కూర్చి మడత పెట్టి అనే ఒకే ఒక బూతు డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు కాలాపాషా.. అలియాస్ కుర్చి తాత. అయితే తాజాగా కుర్చీ తాతను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి నోటి వెంట వచ్చిన కుర్చీ మడత పెట్టి అనే బూతు మాటతోనే మహేష్ గుంటూరు కారం సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ థ‌మన్ ఓ బ్లాక్ బస్టర్ సాంగ్ ను రెడీ చేశాడు. అయితే తాజాగా పోలీసులు ఆ కుర్చీ తాతను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

కుర్చి తాతను ఎస్ఎస్ థ‌వన్ వరకు తీసుకువెళ్లిన వైజాగ్ సత్యా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కుర్చి తాతను అరెస్ట్ చేశారట. గతంలో వైజాగ్ సత్య ఉప్ప‌ల్‌ బాలుతో కలిసి టిక్ టాక్ వీడియోలను చేస్తూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియా సెలబ్రిటీగా చలామణి అవుతున్న సత్య.. స్వయంగా కూర్చి తాతను తమ వరకు తీసుకువెళ్లి.. అతనితో పాటు పాడే అవకాశం ఇచ్చాడు.

Guntur Kaaram's producer's confidence becomes talk of the town

ఇప్పుడు థ‌మన్ దగ్గర డబ్బులు తీసుకుని తాను కాచేసినట్లు కుర్చీ తాత అందరి వద్ద ప్రచారం మొదలుపెట్టాడని సత్య పోలీసులకు ఫిర్యాదు చేశాడట. ఆయన ముందు తనతో బాగానే ఉండేవాడని.. మహేష్ బాబు నుంచి ఇల్లు ఇప్పించమని అడిగితే నా వల్ల కాదని సత్యా చెప్పడంతో ఎదురు తిరిగి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని వైజాగ్ సత్య వివరించాడు. వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు పోలీసులు కుర్చి తాత‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.