అస‌భ్య‌క‌రమైన‌ పనులు చేసి దేవున్ని పూజిస్తే పాపాలు పోతాయా.. నెటిజన్ల కామెంట్స్ పై రష్మీ స్ట్రాంగ్ రియాక్షన్..

తెలుగు సినీ ప్రేక్షకులకు బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ప్రశారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా భారీ పాపులాటి దక్కించుకుంది రష్మీ.. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎక్స్ట్రా జబర్దస్త్ షో లతోపాటు పండగ ఈవెంట్లో సందడి చేస్తూ రెండు చేతుల డబ్బును సంపాదిస్తుంది. అయితే ఓ వైపు బుల్లితెరపై సందడి చేస్తూనే సినిమా అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలోను నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది రష్మీ.

హాట్ షోలో కూడా తగ్గేదేలే అంటూ గ్లామర్ ఫోటోషూట్లతో ఫ్యాన్స్‌కు హ‌ట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ఫ్యాన్ తో ముచ్చటించి వారి ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తుంది రష్మీ. ఇక తాజాగా అయోధ్య రామ ప్రతిష్ట సందర్భంగా ఆనందం వ్యక్తం చేస్తూ ఓ ఆసక్తికర పోస్టును షేర్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ‌. దానిపై ఓ నెటిజ‌న్‌ అసభ్యకరమైన పనులు చేసి భగవంతుడు పూజిస్తే అన్నీ తుడిచి పట్టుకుపోతాయా అంటూ ఘాటు కామెంట్లు చేశాడు. దీనిపై స్పందించిన రష్మి.. గట్టిగా సమాధానమిచ్చింది.

నేనేమైనా డబ్బులు ఎగ్గొట్టానా..? లేదా టాక్స్ లు కట్టడం లేదా..? భాద్య‌త మ‌రిచి తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసానా..? చెట్టరీత్యా చేయకూడని తప్పులు ఏమైనా చేశానా..? మీ దృష్టిలో అసభ్యకరమైన పనులు అంటే ఏంటో..? ఈ మధ్యకాలంలో ఇలాంటి కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. నా వరకు భగవంతుడు సర్వంతర్యామి. సనాతన ధర్మంలో మంచి విషయం అది అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక రష్మి చేసిన కామెంట్స్‌కు స్పందిస్తూ ఆమెకు చాలా మంది సపోర్ట్ గా నిలుస్తున్నారు.