ఆ భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సమంత.. ఆమె ప్లేస్ లో ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్..

ఇండస్ట్రీలో ఒక స్టార్ ఒప్పుకున్న సినిమాను ఎవో కారణాలతో తప్పుకోవడం.. మరో స్టార్ సెలబ్రిటీ ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే అలా జరిగిన ప్రతిసారి ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటిదే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత ఓకే చేసి సెట్స్‌ పైకి వచ్చిన ప్రాజెక్టులోకి శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చినట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. అయితే సమంత గత కొంతకాలంగా మ‌యోసైటీస్ సమస్య‌తో బాధపడుతున్నా ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ దక్కించుకుంది. పుష్ప మూవీలో చేసిన ఐటెం సాంగ్ తో క్రేజ్‌ను వేరే లెవెల్ కు తీసుకెళ్లింది.

Shruti Haasan to Headline BFI-Backed Indo-U.K. Film 'Chennai Story'

అలాగే రాజ్ అండ్ డీకే, హిందీలో రూపొందిస్తున్న సిటాడిల్ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది. ఇక తెలుగులో సామ్ నటించిన శకుంతల మూవీ డిజాస్టర్ కాగా, రౌడీ స్టార్ విజయ్ తో కలిసి నటించిన ఖుషి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. వీటి తరువాత ఓ ఇంగ్లీష్ మూవీ చేసేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చెన్నై స్టోరీస్ పేరుతో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పుడు ఈమె తప్పుకుంది. ఇదొక క్రాస్ కల్చరల్ రూమ్ కం అని సమాచారం. ఈ సినిమాలో ముందుగా సమంత ను హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. కాగా హెల్త్ ఇష్యులతో సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ప్లేస్ లో ఇప్పుడు తాజాగా సలార్‌తో హిట్ కొట్టిన శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చింది.

Shruti Haasan to star in BAFTA winner Philip John's directorial 'Chennai  Story'

ఇందులో వివేక్ క‌ల్రాతో శృతిహాసన్ నటించవోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా షూటింగ్ చెన్నై, కార్డ్ ఆఫ్ నగరాల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా కథను ఎన్ మురళి రాసిన పాపులర్ నవల అరేంజ్ మెంట్ ఆఫ్ లవ్ ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. హాలీవుడ్ ఫిలిం మేకర్ ఫిలిప్ జాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న‌ ఈ సినిమాలో శృతి హాసన్, వివేక్ కల్రా ప్రధాన పాత్రలో నటించాల్సింది. తల్లి మరణంతో చెన్నైకి వచ్చిన యువకుడు ఒక మహిళా డిటెక్టివ్ సహాయంతో తండ్రిని వెతికేందుకు ప్రయత్నించడమే కథంశం. చెన్నై స్టోరీలో.. శృతిహాసన్, చెన్నై కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ డిటెక్టివ్ పాత్రలో కనిపించబోతుంది.