నా జీవితంలో ఇలాంటి సంఘటనలు జ‌రుగుతాయ‌ని అసలు అనుకోలేదు.. వరుణ్ తో లవ్ వల్లే ఇదంతా.. లావణ్య త్రిపాఠి

తెలుగు స్టార్ట్ బ్యూటీ లావ‌ణ్య త్రిపాఠికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమ వివాహం చేసుకొని మెగా కూడలిగా ప్రమోట్ అయిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ ఆభిజిత్‌ కీలకపాత్రలో నటిస్తున్నాడు. లావణ్య పెళ్లయ్యాక మొదటి వెబ్ సిరీస్ కావడంతో ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సీరీస్‌లో లావణ్య పాత్ర ఎలా ఉండబోతుంది.. ఆమె ప్రేక్షకులు ఎలా ఆకట్టుకుంది.. అనే అంశం నెట్టింట చర్చినియాంశంగా మరింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయి అందరిని ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన.. అలాగే తన అత్తారింటికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. వరుణ్ తేజ్ తో లైఫ్ ఎలా ఉంది అని అడిగగా జీవితంలో ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతాయని అనుకోలేదు.

ఇంకా మన పెళ్లి ఎవరితో అవుతుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేం అంవూ వివ‌రించింది. లావ‌ణ్య మాట్లాడుతూ నేను టాలీవుడ్ ఇండస్ట్రీకి రావడం.. వరుణ్‌తో లవ్‌లో పడడం.. పెళ్లి చేసుకోవడం.. ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేయనిదే.. నా ప్రేమ నా హ్యాపీనెస్ కు కారణమైంది. నా జీవితం ఇలా మలుపు తిరగడానికి వరణ్‌తో నా ప్రేమే కారణం. నేను వరుణ్‌తో చాలా హ్యాపీగా ఉన్నా అంటూ వివరించింది. ప్రస్తుతం లావణ్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.