” చరణ్ 16 ” మూవీ పై దిమ్మతిరిగే అప్డేట్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చెర్రీ తాజాగా నటిస్తున్న మూవీ ” గేమ్ చేంజర్ “. ఈ సినిమాపై చెర్రీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ శంకర్ కి మరియు చరణ్ కి తమ కెరీర్ లో 15వ సినిమాగా రానుంది.

ఇక ఈ మూవీ అనంతరం చరణ్ కెరీర్ 16వ సినిమాని దర్శకుడు బుచ్చిబాబుతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి బుచ్చు బాబు ఎప్పుడో సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశారు. ఇక షూటింగ్ కోసం కూడా ఇప్పుడు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం మరో ఇంటరెస్టింగ్ అప్డేట్ అందుతుంది. అదేంటంటే.. ఇండస్ట్రీ హిట్ సినిమా ” రంగస్థలం ” మూవీకి సెట్ వర్క్స్ జరిగిన ప్రాంతంలోనే ఈ సినిమా కోసం కూడా భారీ సెట్టింగ్స్ ని వేశారట. మరి ఈ షూటింగ్ అంతా మార్చి నుంచి మొదలవునున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.