తేజ ” హనుమాన్ ” మూవీ హిందీ లేటెస్ట్ వసూళ్లు ఇవే…!

యంగ్ అండ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజసజ్జ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను వసూళ్లు చేస్తుంది. ఇక ఈ మూవీ హిందీలో కూడా భారీ కలెక్షన్స్ను రాబడుతుంది.

నిన్న ఈ మూవీ మరో 1.25 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇక దీంతో ఈ సినిమా ఇప్పటివరకు 37.79 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇక ఇది సెన్సేషనల్ రెస్పాన్స్ అని ఇక నేడు ఈ సినిమాకి పోటీగా ఫైటర్ రిలీజ్ అయింది. మరి హిందీలో హనుమాన్ ని పక్కకి నెట్టి ఫైటర్ ఏమైనా ముందుకు దూసుకెళ్తుందో లేదో చూడాలి మరి.

ఇక అమృత అయ్యర్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలలో వహించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో రిలీజ్ అయింది. ఇక ప్రస్తుతం లాంగ్ రన్ లో కూడా భారీ వసూళ్లను రాబడుతుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు వచ్చే రెస్పాన్స్ ని చూస్తుంటే ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పొచ్చు. ఇక దీనికి సీక్వెల్ 2025లో రానున్నట్లు ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.