ఆ దేశంలో హృతిక్ ” ఫైటర్ ” మూవీ బ్యాన్.. కారణం ఇదే..!

బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా దీపిక పదుకొన్ హీరోయిన్ గా దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” ఫైటర్ “. ఇక ఈ సినిమా నేడే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఈ మూవీ పలు భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కొన్ని దేశాల్లో బ్యాన్ అయినట్లుగా తెలుస్తుంది.

ఇరాన్, సిరియా, సౌదీ అరేబియా తదితర మిడిల్ ఈస్ట్ దేశాలలో దాదాపు ఫైటర్ రిలీజ్ కి బ్యాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఒక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మాత్రమే సినిమా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా లో అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రలు వహించారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.