ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. దేవర సినిమాకు హైలెట్ గా నిలవనున్న ఓ కీలక ట్విస్ట్..?

ఆర్‌ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హీట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బ‌స్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరి కాంబోలో తెర‌కెక్కుతున్న దేవరపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, గ్లింప్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సరికొత్త గెటప్ లో ఎన్టీఆర్ మరింత వైల్డ్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. గతంలో ఎప్పుడూ లేనంత రఫ్.. రగడ్‌ లుక్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట. అంతేకాదు ఎన్టీఆర్ రోల్ కు ఈ సినిమాలో కీలక ట్విస్ట్ ఉండబోతుందని ఆ ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలెట్గా నిలవబోతుందని తెలుస్తోంది. మరో స్పెషల్ వీడియో గ్లింప్స్‌ త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయని టాక్.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే దేవరా సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది.. కానీ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ తాజాగా గాయపడడంతో సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ మారబోతుందని సమాచారం.