చరణ్ పై అలాంటి కామెంట్స్ చేసిన రాజమౌళి..!

దర్శకు ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తను సినీ చరిత్రలో ఒక్క ఫ్లాప్ కూడా లేదంటే ఆయన ఎంత పెద్ద దర్శకుడో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఇక రాజమౌళి తాజాగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి దుమారం రేపిందో మనందరికీ తెలిసిందే.

ఈ సినిమా విడుదల సమయంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున యుద్ధమే జరిగింది. రామ్ చరణ్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఎన్టీఆర్ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని పోట్లాడుకున్నారు ప్రేక్షకులు. తీరా సినిమా విడుదల అయ్యేసరికి ఇద్దరి పాత్రలు సమానంగా ఉన్నాయి. అయినప్పటికీ ఎన్టీఆర్ పాత్రని సైడ్ రోల్ అని నెట్టింట ఓ రచ్చ మొదలుపెట్టారు తమ ఫ్యాన్స్.

ఇక దీని గురించి రాజమౌళి మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ..” ఈ సినిమాలో కనుక కొమురం భీముడు అనే పాటతోనే సినిమాని కనుక పూర్తి చేసి ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర కేవలం సైడ్ క్యారెక్టర్ అయ్యేది ” అంటూ చరణ్ ఫ్యాన్స్ కి మండించాడు రాజమౌళి. ఇక ప్రస్తుతం ఈయ‌న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.