పుట్టిన ఊరి కోసం అలాంటి పని చేయబోతున్న రిషబ్ శెట్టి.. మహేష్ మూవీ డైలాగ్ ని బాగా ఫాలో అవుతున్నాడుగా..

కన్నడ యంగ్ హీరో రిషబ్‌శెట్టి పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గ‌త ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్ కాంతారాతో హీరోగా మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ వద్ద బీభత్సవం సృష్టించింది. ఆ సినిమాను ఇప్పటికీ జనాలు అదే ఉత్సాహంతో చూస్తున్నారంటే సినిమా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్ణాటకలోని తుళ్ళు సంస్కృతిని ప్రతిబింబించేలా హీరో రిషబ్ శెట్టి ఈ సినిమాని స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఇక ఈ సినిమాకి గాను రిషబ్ శెట్టికి ఇంటర్నేషనల్ స్టేజ్ పైన కూడా ప్రశంసలు అందుతున్నాయి.

చిన్న సినిమాతో రిషిప్ శెట్టి పాన్ ఇండియా హీరో స్టేటస్ అందుకున్నాడు అంటే ఇది సాధారణ విషయం కాదు. అన్ని భాషల్లో ఈ సినిమా రూ.300కోట్ల‌కు పైగా వసూలను కొల్లగొట్టింది. మొత్తంగా చూసుకుంటే సినిమా భారీ కలెక్షన్లను సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ సినిమాను రిషబ్ శెట్టి తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ హీరో గురించి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన పుట్టిన ఊరిలోనే ప్రభుత్వ పాఠశాలల‌న్నీ దత్తత తీసుకొని వాటికి కావాల్సిన క‌నీస సౌకర్యాలను అందించే విధంగా రిషబ్ శెట్టి ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ యంగ్‌ హీరో ఇటీవల తన సొంత‌ చారిటబుల్ ట్రస్ట్ ను కూడా ప్రారంభించాడు.

తన ఫౌండేషన్ ద్వారానే ఈ ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనులు చూసుకోబోతున్నాడని టాక్. ఆదివారం శెట్టి కెరిటీలో పాఠశాలల‌నిటిని సందర్శించాడు. అక్కడ పాఠశాలలోని ఉపాధ్యాయులతో రిషబ్ స్కూల్ దత్తత తీసుకోవడంపై మాట్లాడినట్లు స‌మాచారం. తన పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే రిషబ్ ఇదంతా చేస్తున్నాడట. దీంతో రిషబ్ తన సొంత ఊరి రుణం తీర్చుకుంటున్నాడంటూ ఊరి పెద్దలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మహేష్ బాబు శ్రీమంతుడు మూవీలో ఊరు నీకు చాలా ఇచ్చింది.. తిరిగి ఇచ్చేయ్.. లేదంటే లావైపోతావ్ అన్న డైలాగ్ ను ట్యాగ్‌ చేస్తూ మహేష్ డైలాగ్‌ని బాగా ఫాలో అవుతున్నారు అంటూ.. వెల్డన్ రిషబ్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.