రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రెమ్యూనరేషన్ లెక్క చూస్తే కళ్ళు తేలేస్తారు…!

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్, బాహుబలి వంటి సినిమాలతో ఎంత పెద్ద విజయాన్ని సాధించాడో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈయన కెరీర్లో ఫ్లాప్ అనేది లేదు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇంత పెద్ద విజయాలకు.. కారణం ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమాకి కూడా విజయేంద్ర ప్రసాద్ సహాయం తప్పనిసరిగా ఉంటుంది.

ఇక జక్కన్న సినిమాలతో విజయేంద్ర ప్రసాద్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ డైరెక్టర్లు, నిర్మాతలు సైతం విజయేంద్ర ప్రసాద్ దగ్గరకు వచ్చి స్టోరీస్ గురించి అడుగుతున్నారు.. అంటే ఈయన పాపులారిటీ ఏ లెవెల్ లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉండగా విజయేంద్ర ప్రసాద్ కేవలం రాజమౌళి సినిమాలకు మాత్రమే కథలు అందించడం లేదు. ఈయన అనేక సినిమాలకు కథ అందిస్తున్నారు. ఇక ఇలాంటి విజయేంద్ర ప్రసాద్ కు అత్యధికంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోవడం చాలా అరుదు.

వందల కోట్ల సినిమా లు చేసిన రైటర్ కి వచ్చే రెమ్యూనరేషన్ తక్కువగానే ఉంటుంది. అయితే విజయేంద్ర ప్రసాద్ మాత్రం, రైటర్ గా కథ ఇవ్వడం కోసం ఏకంగా ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే వ్యక్తి ఎవరు అంటే ముందుగా విజయేంద్రప్రసాద్ పేరే వినిపిస్తుంది. ఇక ఈ విధంగా తనకి వచ్చిన వృత్తిలో కొనసాగుతూ కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు విజయేంద్ర ప్రసాద్. ఇక ప్రస్తుతం ఈయన రెమ్యూనరేషన్ తెలిసిన ప్రేక్షకులు కళ్ళు తేలేస్తున్నారు.