సుకుమార్ తెరకెక్కించిన ఆ డిజాస్ట‌ర్‌ మూవీతోనే టాలీవుడ్ షేక్ అయ్యిందా…!

టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన డిఫరెంట్ కాన్సెప్ట్లలో సినిమాలు తీయడంలో దిట్ట. అందులో సక్సెస్ సాధించడంలో కూడా ముందుంటాడు. ఇక ఆర్య నుంచి పుష్ప వరకు ఈన తీసిన సినిమాలు ఒక్కో సినిమా ఒక్కో స్క్రిప్ట్ తో తెరకెక్కించాడు. ముఖ్యంగా ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు తీస్తే నచ్చుతాయనేది తెలుసుకుని ప్రేక్షకుల నాడి పట్టుకుని అలాంటి సినిమాలు తీసి సక్సెస్ పొందుతాడు సుకుమార్. ఇక కొన్నిసార్లు వీళ్లు చేసిన ప్రయోగాలు ఫెయిల్ అవుతుంటాయి.

ఇక అలాంటి సుకుమార్ దర్శకత్వంలో… మహేష్ హీరోగా తెరకెక్కించిన ” వన్ ” మూవీ ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈయన కొత్త స్క్రిప్ తో కొన్ని సినిమాలు తెరకెక్కించాడు. కానీ అవి బోల్తాపడడంతో… అందర‌ డైరెక్టర్ల బాటలోనే సుకుమార్ సైతం నడిశాడు. ఈ క్రమంలోనే రంగస్థలం , పుష్ప వంటి సినిమాలను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. ఇక ఇవి మాస్ ఆడియన్స్ తో పాటు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయి. కానీ సుకుమార్ కి ఇలాంటి సినిమాలు చేయడం కంటే ప్రయోగ్యాత్మకమైన సినిమాలు చేయడం అంటేనే ఇష్టం.ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు కూడా.

వన్ మూవీ ఫ్లాప్ అయినా తరువాత నా సినిమాను అర్థం చేసుకునే అంత తెలివి ప్రేక్షకులకు లేదు అంటూ ఓపెన్ గా చెప్పేశాడు సుకుమార్. ఇక నిజంగా సుకుమార్ లాంటి మేకర్ చేసే సినిమాలు అర్థం చేసుకునే నాలెడ్జ్ ప్రేక్షకుల దగ్గర లేదనేది వాస్తవం. ఇక ఒక స్క్రిప్ట్ కి కనెక్ట్ అయిన ప్రేక్షకుడిని మరో స్క్రిప్ట్ లోకి తీసుకెళ్లడం అనేది కష్టం. ఇక ఇదంతా పక్కన పెడితే సుకుమార్ తన ప్రయత్నం తాను చేశాడు. ఇక వన్ సినిమా హిట్ అయితే… ప్రస్తుతం సుకుమార్ ప్రేక్షకులని మరో స్క్రిప్ట్ లోకి తీసుకెళ్లేవాడనే చెప్పాలి.