” మాయాబజార్ ” సినిమాలో నటించిన ఆ ముసలాయన గురించి తెలిస్తే మైండ్ బ్లాకే…!

మాయాబజార్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేటి తరం వారికి మాయాబజార్ మూవీ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1957లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఈ మూవీని మల్టీ కలర్ లోకి మార్చిన అనంతరం కూడా మూడు, నాలుగుసార్లు రీ రిలీజ్ చేశారు. అయినప్పటికీ ఈ మూవీను మరోసారి వీక్షించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఇటువంటి కథని చాలా అద్భుతంగా రూపొందించి తెరకెక్కించాడు డైరెక్టర్ కెవి రెడ్డి.

ఇక ఈ మూవీలో ఓ మాయా కృష్ణుడిగా ఓ ముసలాయన కనిపిస్తాడు. ఇక ఈయన గురించి తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. ” చిన్న మాయ పెదమాయ.. పెదమాయ పెనుమాయ.. అటు స్వాహా.. ఇటు స్వాహా… ఎరగకుండ వచ్చావు.. ఎరుకలేకపోతావు.. ఇదే వేదం.. ఇదే వేదం.. చిరంజీవ చిరంజీవ “… అంటూ పద్యం పాడే ఈయన పేరు నరసింహారావు. 1934 నుంచి ఈయన సినిమాలలో కొనసాగుతున్నాడు అంటే ఎవ్వరు నమ్మరు. 1935లో వచ్చిన ” హరిశ్చంద్ర ” అనే సినిమాలో ఈయన కాల కేశికుడిగా నటించారు.

ఇక 1955 లో వచ్చిన దొంగ రాముడు సినిమాలోను కనిపించారు. 1957 మార్చ్ 27న రిలీజ్ అయిన మాయాబజార్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఆ కాలంలోనే సుప్రసిద్ధ నటుడుగా పేరు తెచ్చుకున్న ఈయనను సినిమాలలోకి తీసుకునేందుకు అందరూ ఆసక్తి చూపేవారట. ఎటువంటి పాత్రనైనా సులువుగా చేసేవాడట నరసింహారావు. ఇక ప్రస్తుతం ఈయన నటన గురించి తెలిసి ప్రేక్షకులు నోరెళ్ళ పెడుతున్నారు.