ఆ ఒక్కే ఒక్క సీన్ నచ్చక..మంచి మూవీను మిస్ చేసుకున్న ఎన్టీఆర్- బన్నీ..సినిమా బ్లాక్ బస్టర్ హిట్..!

సినిమా ఇండస్ట్రీలో హీరో ఎన్టీఆర్ కి హీరో అల్లు అర్జున్ కి ఎంత మంచి బాండింగ్ ఉందో మనకు తెలిసిందే . బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకునే హీరోలు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ కోసం తెగ కష్టపడి పోతున్నారు . అయితే గతంలో ఈ ఇద్దరు ఒక సినిమాని ఒక్కే రీజన్ తో రిజెక్ట్ చేయడం మరోసారి నెట్టింట వైరల్ గా మారింది.

 

ఆ సినిమా మరేదో కాదు బొమ్మరిల్లు . దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను భాస్కర్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . హీరోగా సిద్ధార్ధ్.. హీరోయిన్గా జెనీలియా ప్రాణం పెట్టి నటించారు . ప్రకాష్ రాజ్ – జయసుధ ఈ సినిమాకు మరో కీలక మలుపు అనే చెప్పాలి . అయితే ఈ సినిమా కథను ముందుగా దిల్ రాజు.. ఎన్టీఆర్ కు వివరించారట . ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారట.

కానీ పదే పదే ఆయనకు ఎక్కువసార్లు ఈ కథ చేయమంటూ రిక్వెస్ట్ చేశారట . అయినా కథ నచ్చక ఎన్టీఆర్ రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత అల్లు అర్జున్ కి కూడా ఈ కథను వివరించారట . ఆయన కూడా ఈ కథ నచ్చక రిజెక్ట్ చేశారట . ఈ సినిమాను ఓకే చేసి తన కెరియర్ల హిట్ వేసుకున్నాడు హీరో సిద్ధార్ధ్. ఈ సినిమా తర్వాత హీరో సిద్ధార్ధ్ రేంజ్ ఏ రేంజ్ లో మారిపోయిందో మనకు తెలిసిందే..!!