రవితేజ పై ఇంత చెత్త బ్యాడ్ రూమరా..? ఎలా తట్టుకుంటాడో ఏమో..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ పై చెత్త చెత్త వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ ల పై దారుణాతి దారుణమైన విషయాలు ట్రోలింగ్ అవుతున్నాయి. తాజాగా అదే లిస్టులోకి వచ్చేసాడు రవితేజ . నిన్న మొన్నటి వరకు ఆయన ఓ యంగ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు అని .. కానీ ఆ తర్వాత హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో సైలెంట్ అయిపోయాడు అని చెత్త పుకార్లు పుట్టించారు జనాలు .

అయితే ఇప్పుడు ఆయన కెరియర్ స్టార్టింగ్ లో ఓ హీరో వద్ద డబ్బులు అప్పుగా తీసుకున్నాడు అన్న ప్రచారం ఊపందుకుంది. అయితే అసలు నిజం ఆ హీరో వద్ద డబ్బు తీసుకున్న మాట వాస్తవమే కానీ అది అప్పు కాదు అది ఆయన రెమ్యూనరేషన్. నాగార్జున నటించిన నిన్నే పెళ్లాడుతా సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసాడు రవితేజ. ఈ క్రమంలోనే ఆయనకు 3,500 చెక్ ఇచ్చాడట నాగార్జున .

అయితే ఈ విషయాన్ని అప్పట్లో కొందరు జనాలు ఆయన పరిస్థితి చూసి జాలిపడి నాగార్జున హెల్ప్ చేశాడు అంటూ పుకార్లు పుట్టించారు. కానీ నిజానికి అది ఆయన కష్టం. ఆయన రెమ్యూనరేషన్ అంటూ ఫ్యాన్స్ అసలు నిజాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఇలా పని పాట లేని కొందరు రవితేజ పై తప్పుడు మాటలను ట్రోల్ చేస్తున్నారు..!!