గబ్బర్ సింగ్ లో ఆ అంత్యాక్షరి సీన్ డిజైన్ చేసిన హీరో.. ఎవరో తెలిస్తే షాక్ అయిపోతారు..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫేవరెట్ మూవీ ఏంటి అంటే టక్కున కళ్ళు మూసుకొని చెప్పేది గబ్బర్ సింగ్ . హరిష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అప్పటి వరకు ఆరు సినిమాల ఫ్లాప్ వేసుకున్న పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా మంచి కం బ్యాక్ ఇచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా గురించి తలుచుకుంటూ ఉంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి.

 

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే కాకుండా కామన్ పీపుల్స్ కి కూడా ఈ సినిమా బాగా నచ్చింది. అయితే ఈ సినిమాలో అందరికీ ఫేవరెట్ సీన్ అంత్యక్షరి . ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు . ఇంకా ఇంకా నవ్వాలి అనిపిస్తుంది . అయితే ఈ సీను డిజైన్ చేసింది మరెవరో కాదు ..పవన్ కళ్యాణ్ . పవన్ కళ్యాణ్ ఈ సీన్ చేసేటప్పుడు హరీష్ శంకర్ చాలా లైట్ గా రాసుకున్నారట .

కానీ ఈ సీన్ ని ఇంకా బాగా ఎలివేట్ చేయొచ్చు అంటూ ఒక కమెడియన్ కి ఒక్కొక్క పాటను డిజైన్ చేస్తూ ఆయనే ఈ ఐడియాను ఇచ్చాడట . ఆ తర్వాత ఈ సీన్ ఎంత హైలెట్ అయిందో సినిమా హిట్ కి ఎంత కారణమైందో మనకు తెలిసిందే. ఆయన కెరీర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది..!!