జూ పులిబొనులో సగం తిన్న వ్యక్తి మృతదేహం.. షాక్ లో జనం.. ఏం జరిగిందంటే..?!

యానిమల్ జుకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని జూ సిబ్బంది ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా కొంతమంది మాత్రం అల్లరి చిల్లరగా వ్యవహరిస్తూ ఆజాగ్రత‌గా మెలుగుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో జంతుప్రదర్శనశాలకు వెళ్లిన కొందరు వెక్కిలి చేష్టలు చేయడం మనం గమనించవచ్చు. మరి కొన్ని సందర్భాల్లో వ్యక్తులు బోన్‌లో ఉన్న జంతువులు ముట్టుకోవాలని లేదా, వాటికి ఆహారం పెట్టాలని అత్యుత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో పలు ప్రమాదాలు జ‌ర‌గడం కూడా ఎన్నిసార్లు వార్తల్లోవిన్నిపించాయి. అయితే అలాంటి ఓ సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది.

పాకిస్తాన్లోని షేర్ బాగ్ యానిమల్ జూలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన బయటకు వచ్చింది. జ్యూ సిబ్బంది టైగర్ బోన్‌లో సగం తిన్న వ్యక్తి శవాన్ని గుర్తించారు. ఆ వ్యక్తి పులిబొనులోకి దూకి ఉంటాడన భావిస్తున్నారు. వన్యప్రాణి డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్ ఉస్మాన్ బుకారి దీనిపై స్పందిస్తూ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని.. అక్కడ సిసిటీవీ ఫుటేజ్.. ఎన్‌క్లోజర్ నుంచి వచ్చిన ఆధారాలు ప్రకారం అతనిపై పులులు దాడి చేసే టైంలో అతను బ్రతికే ఉన్నాడని.. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీంతో పంజాబ్ లోని తూర్పు ప్రావిన్స్ లో ఉన్న ఈ జంతుప్రదర్శనశాలని మూసివేశారు.

అలాగే పులిబొనులోకి ఆ వ్యక్తి ఎలా ఉండి ఉంటాడనే కోణంలో ఎంక్వయిరీ జరుగుతుంది. అయితే పులి మనిషి పై దాడి చేయడానికి బోన్ లో నుంచి అది బయటకు రాలేదు. దానికి బదులుగా చనిపోయిన వ్యక్తి పులి ఆవరణలోనికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఏదైనా భద్రత లోపం ఉంటే దానిని కూడా పరిష్కరిస్తామని జూ సిబ్బంది చెప్పారు. అవసరమైతే జూలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను కూడా నియమిస్తామని.. మృతదేహం గుర్తించలేని స్థితిలో ఉందని, మృతదేహాన్ని గుర్తించేందుకు కూడా ఎవరు ముందుకు రాలేదని వివరించారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే పులి బోన్‌లో దూకిన ఆ వ్యక్తి ఓ మతిస్థిమితం లేని వ్యక్తిగా చూసి సిబ్బంది చెబుతున్నారు. అయితే ఇంకా ఈ విషయంపై పూర్తి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈ కేసు పై విచారణ జ‌రుగుతుంది