మరో జాతీయ అవార్డును దక్కించుకున్న రామ్ చరణ్.. బెస్ట్ బాలీవుడ్ యాక్టర్‌గా చెర్రీ..?!

గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ భారీ క్రేజ్‌ సంపాదించిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్‌ సంపాదించుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం పాన్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ డైరెక్ష‌న్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా కంటే ముందు రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్ తో ఆయనకు గ్లోబల్ వైడ్‌గా గుర్తింపు వచ్చింది.

అలాగే పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా దక్కించుకున్న రామ్ చరణ్ తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డును దక్కించుకున్నట్లు తెలుస్తోంది. యూఎస్ కి చెందిన పాప్‌ గోల్డెన్ అవార్డ్స్.. ఇంటర్నేషనల్ అవార్డ్స్ ను ఇండియన్ సినిమా తరపున బాలీవుడ్ స్టార్స్‌ నామినేషన్‌లో రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్‌గా ఎంపికైనట్లు అనౌన్స్ చేశారు. దీంతో రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రీసెంట్ గానే నెట్‌ఫ్లిక్స్‌ సీఈవో కూడా రామ్‌చరణ్‌ని కలిసి తనతో సెల్ఫీ దిగిన సంగతి తెలిసిందే.

గ్లోబల్‌గా రామ్ చరణ్ క్రేజ్ రోజురోజుకు పెరగడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్.. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సన్నాతో మరో సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బుచ్చిబాబు సన్నా, చెర్రీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాల్లో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.