నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 7 మరో ఐదు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం హౌస్ లో 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ వారం ప్రియాంక క్యాప్టెన్సీ ని పొందింది. అలాగే 11వ వారం నామినేషన్స్ లో.. అర్జున్, గౌతమ్, యావర్, అమర్, అశ్విని, రతిక, శోభా శెట్టి ఉన్నారు.
ఇక నాగార్జున ఈ షో ప్రారంభం కాకముందు ఉల్టా పుల్టా అని చెప్పినట్టుగానే ప్రస్తుతం ఈ షో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. డబుల్ ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ హౌస్ నుంచి రతిక, అశ్విని బయటకు రానున్నట్లు సమాచారం.
రతిక నాలుగవ వారం ఎలిమినేట్ అయ్యి… వైల్డ్ కార్డు ఎంట్రీ తో మళ్ళీ హౌస్ లోకి రియంట్రీ ఇచ్చింది. ఇక అశ్విని సైతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరో ముగ్గురు కంటెస్టెంట్లు 12, 13, 14 వారాలలో ఎలిమినేట్ అవ్వనున్నారు. మిగిలిన ఐదుగురు మాత్రం టాప్ 5 కంటెస్టెంట్లుగా నిలవనున్నారు. మరి ఆ టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఎవరు అవుతారో చూడాలి.