Worldcup 2023: వరల్డ్ కప్ గెలిచిన టీమ్ కి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా..?

క్రికెట్ అభిమానులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ రానే వస్తోంది. రేపటి రోజున టీమ్ ఇండియా -ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు జరగబోతోంది.. ఈ విషయంపై ఇండియన్ క్రికెట్ టీం గెలవాలని ఇండియన్ ప్రేక్షకుల సైతం చాలా బలంగా కోరుకుంటున్నారు. అయితే ఏ జట్టు గెలుస్తుంది అనే విషయం పైన బెట్టింగులు కూడా భారీగానే జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే వరల్డ్ కప్ కొట్టిన టీమ్ కి ప్రైజ్ మనీ వివరాల కోసం చాలామంది ప్రేక్షకులు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.

India vs Australia World Cup 2023 Final: When, Where, How to Watch IND vs  AUS Cricket Match - BusinessToday

ఆదివారం రోజున ఫైనల్ లో గెలిచిన టీంకు అక్షరాల నాలుగు మిలియన్ డాలర్లు సైతం వస్తాయట.. దీంతో ఇండియన్ కరెన్సీ ప్రకారం 33 కోట్ల రూపాయల 31 లక్షలు వస్తాయట.. ఇక రన్నర్ గా నిలిచిన జట్టు కోసం సగం ఇస్తారట.. అంటే 16 కోట్ల రూపాయలు పై మాటే అని చెప్పవచ్చు.. అయితే సెమి ఫైనల్ నుంచి ఇంటి దాగు పట్టిన న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా టీములకు ప్రైజ్ మనీ కూడా భారీగానే ఉంటుందట.

ఈ రెండు జట్లకు దాదాపుగా 8 లక్షల డాలర్లు ఇస్తారట. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 6 కోట్ల 60 లక్షలు అందుతాయట.. ఇక సూపర్ సిక్స్ దశలో వెనుతిరిగిన పలు రకాల జట్లకు సైతం 83 లక్షల రూపాయలు ఇస్తారట లీగ్ దశలో ప్రతి మ్యాచ్లో గెలిచిన ప్రతి జట్టుకు కూడా 33 లక్షల రూపాయలు చొప్పున ప్రైజ్ మనీని అందించబోతున్నట్లు తెలుస్తోంది. మరి రేపటి రోజున ఏ టీమ్ గెలుస్తుందో చూడాలి మరి.